Wednesday, October 27, 2010

వింత సంసారం--1971

















సంగీత::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::P.సుశీల,S.P.బాలు 
తారాగణం::సావిత్రి,రమాప్రభ,జగ్గయ్య,రామ్మోహన్,రాజబాబు,చిత్తూర్ వి నాగయ్య,లీలారాణి.

పల్లవి::

కోనసీమ పల్లెలోన..గొప్పవారి ఇంటిలోన
పాపలాంటి మనసున్న..బాబుగారు
ఏ అన్నెమూ పున్నెమూ..ఎరగనివారు
ఎవరయ్యా వారెవరయ్యా..ఎవరయ్యా వారెవరయ్యా
కోనసీమ పల్లెలోన..గొప్పవారి ఇంటిలోన
గోవులాంటి ఇల్లాలు..ఉందమ్మా
ఏ అన్నెమూ పున్నెమూ..ఎరగదమ్మా
ఎవరమ్మా ఆమెవరమ్మా..ఎవరమ్మా ఆమెవరమ్మా 

చరణం::1

ముచ్చటైన మొదటి రాత్రి..మోమైనా చూడలేదు
వద్దకైనా చేరలేదు..ముద్దుమాట లాడలేదు
ముచ్చటైన మొదటి రాత్రి..మోమైనా చూడలేదు
పిల్లలా సిగ్గుపడి..చల్లగా జారాడు
మూలాన కూచొని..కునికిపాట్లుపడ్డాడు
ఎవరయ్యా..వారెవరయ్యా 

చరణం::2

మొదటి రాత్రి ముచ్చట్లు..ఏ బడిలో నేర్పలేదు
ఇల్లాలి సరసాలు..ఏచోటా చదవలేదు
మొదటి రాత్రి ముచ్చట్లు..ఏ బడిలో నేర్పలేదు
వలచీ వలపించే..చెలియలేదు నేటిదాక
అందుకే గదిలోన..కునికిపాట్లు పడ్డాడు
ఎవరమ్మా ఆమెవరమ్మా..ఎవరమ్మా ఆమెవరమ్మా 

చరణం::3

చుక్కతోనెలవంకను చూడలేదా
ఊహూ చిలుకను గోరింక పిలుచుకోదా 
కలువతో తుమ్మెద కలుసుకోదా
ఆ ఆ ఆ..కలువతో తుమ్మెద కలుసుకోదా 
వాటిని చూసైనా తెలుసుకోలేదా..ఆహా
శివుడు తన సగము పార్వతికిచ్చాడు
తిరుపతి వెంకన్న ఇరువురినీ వలచాడు
శివుడు తన సగము పార్వతికిచ్చాడు
విష్ణువు శ్రీదేవిని వెంట నిలుపుకున్నాడు
పద్మనాభుడు తనసతిని మనసులోన దాచాడు
శ్రీమద్రమారమణ గోవిందో హాయి
ఎవరయ్యా వారెవరయ్యా నేనమ్మా అతడు నేనమ్మా 

No comments: