క్షత్రియుడు--1990
సంగీతం::ఇళయరాజా
రచన::రాజశ్రీ
డైరెక్టర్::K.సుభాష్
గానం::స్వర్ణ లతా
Starring :Vijayakanth, Bhanupriya, Revathi
పల్లవి::
పాటగా నాలో మధురాలు విరిసే
మల్లెలీ వేళా పరువాలు పరిచే
దేహం అదిరెను..మొహం విరిసేను
ప్రాయం మాటులో..మౌనం వేలిసేను
హృదయమే పిలిచేనే..చిగురాశలె..పలికేనే
పాటగా నాలో మధురాలు విరిసే
చరణం::1
వలపే తేనే నవ్వులజల్లై యెదలో కురిసే
తలపే కోటి చిందులేసే..అలలై మెరిసే.
వగలే కొసరి రాగమాలా..కదిలే వింత పాటలే
కోరే చిలిపి బాసలోనా..చిలికే లేత ధ్యాసలె
హృదయమే పిలిచేనే..చిగురాసలె..పలికేనే
పాటగా నాలో మధురాలు విరిసే
మల్లెలీ వేళా పరువాలు పరిచే
చరణం::2
వయసే నేడు ఇంద్రధనుసై..కధలే పెంచే
మనసే గుండెలోన వేయి కలలే పంచె
కనులే నాకు జోల పాడే..యిది ఏ రాజా యోగమో
ఖసిగా..మనసు ఆలపించే..ఉరికే రాగ బంధమో
హృదయమే పిలిచేనే..చిగురాసాలే పలికేనే..నే..
పాటగా నాలో మధురాలు విరిసే
మల్లెలీ వేళా పరువాలు పరిచే
దేహం అదిరెను..మొహం విరిసేను
ప్రాయం మాటులో..మౌనం వేలిసేను
హృదయమే పిలిచేనే..చిగురాశలె..పలికేనే
పాటగా నాలో మధురాలు విరిసే
మల్లెలీ వేళా పరువాలు పరిచే
No comments:
Post a Comment