Showing posts with label వింత సంసారం--1971. Show all posts
Showing posts with label వింత సంసారం--1971. Show all posts

Wednesday, October 27, 2010

వింత సంసారం--1971

















సంగీత::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::P.సుశీల,S.P.బాలు 
తారాగణం::సావిత్రి,రమాప్రభ,జగ్గయ్య,రామ్మోహన్,రాజబాబు,చిత్తూర్ వి నాగయ్య,లీలారాణి.

పల్లవి::

కోనసీమ పల్లెలోన..గొప్పవారి ఇంటిలోన
పాపలాంటి మనసున్న..బాబుగారు
ఏ అన్నెమూ పున్నెమూ..ఎరగనివారు
ఎవరయ్యా వారెవరయ్యా..ఎవరయ్యా వారెవరయ్యా
కోనసీమ పల్లెలోన..గొప్పవారి ఇంటిలోన
గోవులాంటి ఇల్లాలు..ఉందమ్మా
ఏ అన్నెమూ పున్నెమూ..ఎరగదమ్మా
ఎవరమ్మా ఆమెవరమ్మా..ఎవరమ్మా ఆమెవరమ్మా 

చరణం::1

ముచ్చటైన మొదటి రాత్రి..మోమైనా చూడలేదు
వద్దకైనా చేరలేదు..ముద్దుమాట లాడలేదు
ముచ్చటైన మొదటి రాత్రి..మోమైనా చూడలేదు
పిల్లలా సిగ్గుపడి..చల్లగా జారాడు
మూలాన కూచొని..కునికిపాట్లుపడ్డాడు
ఎవరయ్యా..వారెవరయ్యా 

చరణం::2

మొదటి రాత్రి ముచ్చట్లు..ఏ బడిలో నేర్పలేదు
ఇల్లాలి సరసాలు..ఏచోటా చదవలేదు
మొదటి రాత్రి ముచ్చట్లు..ఏ బడిలో నేర్పలేదు
వలచీ వలపించే..చెలియలేదు నేటిదాక
అందుకే గదిలోన..కునికిపాట్లు పడ్డాడు
ఎవరమ్మా ఆమెవరమ్మా..ఎవరమ్మా ఆమెవరమ్మా 

చరణం::3

చుక్కతోనెలవంకను చూడలేదా
ఊహూ చిలుకను గోరింక పిలుచుకోదా 
కలువతో తుమ్మెద కలుసుకోదా
ఆ ఆ ఆ..కలువతో తుమ్మెద కలుసుకోదా 
వాటిని చూసైనా తెలుసుకోలేదా..ఆహా
శివుడు తన సగము పార్వతికిచ్చాడు
తిరుపతి వెంకన్న ఇరువురినీ వలచాడు
శివుడు తన సగము పార్వతికిచ్చాడు
విష్ణువు శ్రీదేవిని వెంట నిలుపుకున్నాడు
పద్మనాభుడు తనసతిని మనసులోన దాచాడు
శ్రీమద్రమారమణ గోవిందో హాయి
ఎవరయ్యా వారెవరయ్యా నేనమ్మా అతడు నేనమ్మా 

వింత సంసారం--1971




సంగీత::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::ఘంటసాల
తారాగణం::సావిత్రి,రమాప్రభ,జగ్గయ్య,రామ్మోహన్,రాజబాబు,చిత్తూర్V.నాగయ్య,లీలారాణి.

పల్లవి::

నా కంటి పాప..నా యింటి దీపం
ఆనాడు ఈనాడు..యేనాడు నీవే
నీ కంట నీరు..నే చూడలేను
హృదయాన జ్వాల..రగిలేనులే 

చరణం::1

కష్టాలనన్నీ సౌఖ్యాలు..చేసి
కన్నీటినంతా పన్నీరు..చేసే
కులకాంత వొడిలో..తలవాల్చగానే 
స్వర్గాలు భువి పై..వాలేనులే 

అడ్డాలలోన..బిడ్డలేగాని
పెరిగేరు వారు..మరిచేరు మనను
వయసైనవారు..కోరేటి మమత
కరువాయె మనకు..బరువాయె బ్రతుకు
కరువాయె మనకు..బరువాయె బ్రతుకు

చరణం::2

చల్లంగ చూచే..ఇల్లాలితో
ఈ లోకాన ఎవరూ..సరిరారులే 
నాలోన సగమై..నా ప్రేమ జగమై
నా తోడు నీడై..నిలిచేవులే..ఏ..

నా కంటి పాప..నా యింటి దీపం
ఆనాడు ఈనాడు..యేనాడు నీవే
నీ కంటనీరు..నే చూడలేను..ఊఊ 

Tuesday, August 10, 2010

వింత సంసారం--1971


















సంగీతం::S.P.కోదండపాణి
Director::Savithri 
రచన::కొసారాజు
గానం::పిఠాపురం, L.R.ఈశ్వరి 
తారాగణం::జగ్గయ్య, సావిత్రి, నాగయ్య,రాంమోహన్, రాజబాబు, రమాప్రభ

పల్లవి::

హల్లో..బుల్ బుల్..బుల్ బుల్..బుల్ బుల్
బ్యూటీ ప్యారీ రావే రావే..నా కళ్ళలోన మెరిసే స్టారువు నీవే నీవే
వయ్యారివే మిటారివే, బలె బలె..పక్కా కిలాడివేయ్యా 
అయ్యో..నో నో  నో నో నో నో
రానే రాను సారీ సారీ..మా నానున్నాడు అవతల,
ఏమిటి హర్రీ బర్రీ గల్లంతుగా వాగేవుగా..పోపో మిస్టర్ చాటుగా

నాన్నా మీనాన్నా మీ నాన్నుంటే..నాకేమి భయం
రాణీ నా రాణీ నువ్ లవ్చేస్తేనే యిస్తాను ప్రాణం హాయ్
నాన్నా మీనాన్నా మీ నాన్నుంటే..నాకేమి భయం
లవ్వు గివ్వు కైపు కాస్త దింపుతాడూ..నీ వీపు బాగా సాపుచేసి పంపుతాడూ 
చిరాకు పడకే చిట్టెమ్మా గిరాకి ఏమిటో చెప్పమ్మా
చాల్లే నోర్ముయ్ సంతోషించా..టా టా టా టా
హల్లో బుల్ బుల్
నీ కోసమొచ్చానే నినుజూచి మెచ్చానే..నీకాళ్ళమీదపడి వుంటానే
ఓయ్ నీవేమి చెప్పినా వింటానే..హెయ్ నీవేమి చెప్పినా వింటానే

యిక తగ్గమంటాను..దయచెయ్య మంటాను
యిక తగ్గమంటాను..దయచెయ్య మంటాను
పోనంటె పోను పోను..ఏమన్న వదిలిపోను 
పోనంటె పోను పోను..ఏమన్న వదిలిపోను 
నువ్వు మోడి వేస్తేనూ..నువ్వు మోడి వేస్తేనూ
నీ దుమ్ము దులుపుతాడు..నా మీద దయలేదా..నేనంటే సరిపోదా 
నీ కోసమొచ్చానే నినుజూచి మెచ్చానే..నీకాళ్ళమీదపడి వుంటానే
మెడబట్టి గెంటుతాను..పోనంటె పోను పోను..మెడబట్టి గెంటుతాను
పో పో..ఆ..అహా..పో..పో..ఊ..ఊహూ

వింత సంసారం--1971


















సంగీతం::S.P.కోదండపాణి
Director::Savithri 
రచన::దాశరధి
గానం::P.సుశీల, కౌసల్య బృందం 
తారాగణం::జగ్గయ్య, సావిత్రి, నాగయ్య,రాంమోహన్, రాజబాబు, రమాప్రభ

పల్లవి::

ఆది దంపతులు మీరు..సీతారాములు మీరు
పుణ్య దంపతులు మీరు..కలకాలం వర్ధిల్లాలి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::1

పెద్దలే జరిపారు మీ పెళ్ళి ఆనాడు 
పిన్నలము జరిపేము ఈ పెళ్ళి ఈనాడు
పెద్దలే జరిపారు మీ పెళ్ళి ఆనాడు 
పిన్నలము జరిపేము ఈ పెళ్ళి ఈనాడు
అందరికీ మీజంట ఆదర్శం కావాలి 
ఇంటింట మీ మంచి చెప్పుకోవాలి 
అందరికీ మీజంట ఆదర్శం కావాలి 
ఇంటింట మీ మంచి చెప్పుకోవాలి 
మేమంతా అది వినీ మురిసిపోవాలి
చిరకాలం మీ ఆశలు వర్ధిల్లాలి 
చిరకాలం మీ ఆశలు వర్ధిల్లాలి
పెద్దలే జరిపారు మీ పెళ్ళి ఆనాడు 
పిన్నలము జరిపేము ఈ పెళ్ళి ఈనాడు

చరణం::2

నా స్వామి మనసులో నాకు చోటుంది
లోకాన ఇకనాకు లేనిదేముంది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నా స్వామి మనసులో నాకు చోటుంది
లోకాన ఇకనాకు లేనిదేముంది
నా స్వామి పాదాల నా జీవితం
కావాలి, కావాలి నవపారిజాతం 
నా స్వామి పాదాల నా జీవితం
కావాలి, కావాలి నవపారిజాతం 
సీతమ్మ రామయ్య కల్యాణమే
లోకాన అందరికీ వైభోగమే
సీతమ్మ రామయ్య కల్యాణమే
లోకాన అందరికీ వైభోగమే
యే వేళ యిరువురిది ఒక ప్రాణమే
రామయ్యదొకమాట ఒక బాణమే
యే వేళ యిరువురిది ఒక ప్రాణమే
రామయ్యదొకమాట ఒక బాణమే
ఆలూ మగలా సరదాలు
రోజూ రోజూ వేడుకలు
ఆలూ మగలా సరదాలు
రోజూ రోజూ వేడుకలు
సీతమ్మ రామయ్య కల్యాణమే
లోకాన అందరికీ వైభోగమే