Thursday, October 30, 2014

రంగూన్ రౌడి--1979



సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరిసుందరరామమూర్తి  
గానం::P.సుశీల, S.P.బాలు
Film Directed By::Dasari Narayanarao 
తారాగణం::కృష్ణంరాజు , జయప్రద,మోహన్‌బాబు,దీప,జానకి,రావు గోపాల రావు,పుష్పలత.  

పల్లవి::

అతను::అదరహో..ఓ..అదరహా..అదరహో..ఓ..అదరహా
నీ అందం చూస్తే అదరహా..నా మురపెం చూస్తే ముదరహా
నా వయసు నీ సొగసు..నా వయసు నీ సొగసు కలుసుకుంటే..ఏఏఏఏఏ
యమహా..యమహా..యమహా..యమహా  

ఆమె::అదరహో..ఓ..అదరహా..అదరహో..ఓ..అదరహా
నీ వాటం చూస్తే అదరహా..నా వైనం చూస్తే ముదరహా
నా మనసూ నీ వయసూ..నా మనసూ నీ వయసూ కలుపుకొంటే..ఏఏఏఏ
యమహా..యమహా..యమహా..యమహా  
అతడు::అదరహో..ఓఓఓఓఓ..అదరహా
ఆమె::అదరహో..ఓఓఓఓఓ..అదరహా

చరణం::1

అతడు::నీకు తక్కువేమున్నది..బక్కనడుము ఒక్కటిమినహా
ఆమె::ఆ నడుము లేని నడకలు చూస్తే..పడుచు వాడి మనసు..తహ తహ
అతను::నీ వయ్యారం దిద్దుకుంది..శృంగారపు ఓనమ:
వయ్యారం దిద్దుకుంది..శృంగారపు ఓనమ:
ఆమె::గుట్టు రట్టు చేయమాకు..గురూ నీకు నమో నమః 

అతడు::అదరహా..
ఆమె::ముదరహా..
అతడు::అదరహా..
ఆమె::ముదరహా..
అతడు::హయమ్మ హయమ్మ హయమ్మ హాయమ్మ..ఆహా
ఆమె::అదరహో..ఓఓఓఓఓ..అదరహా
అతడు::నీ అందం చూస్తే అదరహా..నా మురపెం చూస్తేముదరహా
ఆమె::నా మనసూ నీ వయసూ..నా మనసూ నీ వయసూ కలుపుకొంటే..ఏఏఏఏ
అతడు::యమహా..యమహా..యమహా..యమహా  
ఆమె::అదరహో..ఓఓఓఓఓ..అదరహా
అతడు::అదరహో..ఓఓఓఓఓ..అదరహా

చరణం::2

ఆమె::పిల్ల గాలి తగిలిందంటే..ఏఏఏ..పిల్లగాడి పిచ్చి ముదరహ
అతను::పిచ్చికాస్త ముదిరిందంటే..ఏఏఏ..పిల్లతో పెళ్ళి కుదరహ
ఆమె::కోరుతున్న కోడెగాడు..కోహినూరు వరహా
ఆమె::కోరుతున్న కోడెగాడు..కోహినూరు వరహా
అతను::ఒకే జంటగా బతకాలని..సందమాన సలహా 

అతడు::అదరహా..
ఆమె::ముదరహా..
అతడు::అదరహా..
ఆమె::ముదరహా..
అతడు::హయమ్మ హయమ్మ హయమ్మ హాయమ్మ..ఆహా
అతడు::అదరహో..ఓఓఓఓఓ..అదరహా
అతడు::అదరహో..ఓఓఓఓఓ..అదరహా
ఆమె::నీ వాటం చూస్తే అదరహా..నా వైనం చూస్తే ముదరహా
అతడు::నా వయసు నీ సొగసు..నా వయసు నీ సొగసు కలుసుకుంటే..ఏఏఏఏఏ
ఆమె::యమహా..యమహా..యమహా..యమహా  
అతడు::::అదరహో..ఓఓఓఓఓ..అదరహా
అతడు::::అదరహో..ఓఓఓఓఓ..అదరహా

Rangoon Roudi--1979
Music::J.V.Raaghavulu
Lyrics::Vetoorisundararaamamoorti  
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Dasari Narayanarao
Cast::KrishnamRaju,Jayaprada,Mohanbabu,Deepa,Janaki,RaoGopalRao,Pushpalata.  

:::::::::

atanu::adarahO..O..adarahaa..adarahO..O..adarahaa
nee andam choostE adarahaa..naa murapem choostE mudarahaa
naa vayasu nee sogasu..naa vayasu nee sogasu kalusukunTE..EEEEE
yamahaa..yamahaa..yamahaa..yamahaa  

Ame::adarahO..O..adarahaa..adarahO..O..adarahaa
nee vaaTam choostE adarahaa..naa vainam choostE mudarahaa
naa manasuu nee vayasuu..naa manasuu nee vayasuu kalupukonTE..EEEE
yamahaa..yamahaa..yamahaa..yamahaa  
atanu::adarahO..OOOOO..adarahaa
Ame::adarahO..OOOOO..adarahaa

::::1

atanu::neeku takkuvEmunnadi..bakkanaDumu okkaTiminahaa
Ame::aa naDumu lEni naDakalu choostE..paDuchu vaaDi manasu..taha taha
atanu::nee vayyaaram diddukundi..SRngaarapu Onama:
vayyaaram diddukundi..SRngaarapu Onama:
Ame::guTTu raTTu chEyamaaku..guroo neeku namO nama@h 

atanu::adarahaa..
Ame::mudarahaa..
atanu::adarahaa..
Ame::mudarahaa..
atanu::hayamma hayamma hayamma haayamma..aahaa
Ame::adarahO..OOOOO..adarahaa
atanu::nee andam choostE adarahaa..naa murapem choostE mudarahaa
Ame::naa manasuu nee vayasuu..naa manasuu nee vayasuu kalupukonTE..EEEE
atanu::yamahaa..yamahaa..yamahaa..yamahaa  
Ame::adarahO..OOOOO..adarahaa
atanu::adarahO..OOOOO..adarahaa

::::2

Ame::pilla gaali tagilindanTE..EEE..pillagaaDi pichchi mudaraha
atanu::pichchikaasta mudirindanTE..EEE..pillatO peLLi kudaraha
Ame::kOrutunna kODegaaDu..kOhinooru varahaa
Ame::kOrutunna kODegaaDu..kOhinooru varahaa
atanu::okE janTagaa batakaalani..sandamaana salahaa 

atanu::adarahaa..
Ame::mudarahaa..
atanu::adarahaa..
Ame::mudarahaa..
atanu::hayamma hayamma hayamma haayamma..aahaa
atanu::adarahO..OOOOO..adarahaa
atanu::adarahO..OOOOO..adarahaa
Ame::nee vaaTam choostE adarahaa..naa vainam choostE mudarahaa
atanu::naa vayasu nee sogasu..naa vayasu nee sogasu kalusukunTE..EEEEE
Ame::yamahaa..yamahaa..yamahaa..yamahaa  
atanu::::adarahO..OOOOO..adarahaa
atanu::::adarahO..OOOOO..adarahaa

Wednesday, October 29, 2014

మహాకవి కాళిదాసు--1960



సంగీతం::పెండ్యాల

రచన::పింగళి నాగేంద్రరావు

గానం::పి.లీల,రత్నం,బృందం

Directed by::Kamalakara Kameswara Rao 

తారాగణం::A.N.R. S.V.రంగారావు,రేలంగి,శ్రీరంజని,రాజసులోచన,C.S.R.సంధ్య,వాసంతి.


పల్లవి::


శ్రీకరమగు పరిపాలన..నీదే జగదీశ్వరీ

లోకావన నిత్యంవ్రత..నీవే భువనేశ్వరీ  

శ్రీకరమగు పరిపాలన..నీదే జగదీశ్వరీ


చరణం::1


నీ కృపా కటాక్షములే..సకల శుభములొసగగా

నీ కృపా కటాక్షములే..సకల శుభములొసగగా

ఇహ పరముల కాధారము..మహాలక్ష్మి నీవేగా

శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ


చరణం::2


నీ వీణా నాదములో..వేదములే పలుకగా

నీ వీణా నాదములో..వేదములే పలుకగా

జటజగములు మేలు కొలుపు..మహావాణి నీవెగా

శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ


చరణం::3


నీవిజయ విహారములే..లోక రక్షలౌనుగా ఆఅఆఆఆఆ 

నీవిజయ విహారములే..లోక రక్షలౌనుగా

అభయమొసగి భువనమేలు..మహాకాళి నీవెగా


శ్రీకరమగు పరిపాలన..నీదే జగదీశ్వరీ

లోకావన నిత్యంవ్రత..నీవే భువనేశ్వరీ 

శ్రీకరమగు పరిపాలన..నీదే జగదీశ్వరీ 

భలే అమ్మాయిలు--1957



సంగీతం::సాలూరి రాజేశ్వరరావు 
రచన::సదాశివబ్రహ్మం
గానం::M.L.వసంతకుమారి,P.లీల
సినిమా దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,గిరిజ,రేలంగి,జగ్గయ్య,పేకేటి శివరాం,C.S.R. ఆంజనేయులు.

పల్లవి::


గోపాల జాగేలరా..ఆ
బాలగోపాల జాగేలరా..ఆ
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా..ఆ
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా దరిజేర చలమేలరా..ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దరిజేర చలమేలరా..ఆ
నన్ను దయజూడ విధియేమిరా..ఆ
దరిజేర చలమేలరా..ఆఆఅ 
నన్ను దయజూడ విధియేమిరా..ఆ
మొర వినవేల కనవేల మురళీధర కరుణాకర గిరిధర 
గోపాల జాగేలరా..ఆ

కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళి
అనుపమ సంగీత మొలికించు సరళి 
కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళి
అనుపమ సంగీత మొలికించు సరళి
కనుగొని ప్రేమించి నిను జేరినా..ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కనుగొని ప్రేమించి నిను జేరినా..ఆ
చనువున నేనెంతో బ్రతిమాలినా 
కనుగొని ప్రేమించి నిను జేరినా..ఆ
చనువున నేనెంతో బ్రతిమాలినా
కనికరించి పలుకరించవేలరా
మురళీధర కరుణాకర గిరిధర 
గోపాల జాగేలరా..ఆ

సరిగపద..గోపాల జాగేలరా..ఆ
సదపగరి సరిగపద..గోపాల జాగేలరా..ఆ
పగరిసదా సరిగపద..గోపాల జాగేలరా..ఆ
దాసరి పాదస పా సరిగపద..గోపాల జాగేలరా..ఆ
గరిగరిసా రిసరిసదా రిసదప గరిగపద..గోపాల జాగేలరా..ఆ
సాస దదసాస గపదసాస రిగపదసాస సరిగపద..గోపాల జాగేలరా..ఆ
రీగ రిగ రీరీ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
రిగ రిరి సనీని దనిగరిసనీ దనిరిసనీ దనిని దపమ
పదప పనిద దసని నిరస సగరి నిరిస దసని పనిదా
గమపదని..గోపాల జాగేలరా..ఆ
నిస్సనినిసా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నిరిస నిసదా పగరిసదా పరిసదా పసదా పదపదని
దనిదనిస నిసనిసరి సరిగగరీ నిసరిరిసని దనిన సనిద
పమాపదని..గోపాల జాగేలరా..ఆ
గగమ గమగా గామగమ రిమగ గరిస గరిస నిదరిస నిద
సనిదపపా దసరిగా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
రీగరిగరీరీ రిమగగారిన గరిరీస దరిస
సానీదాప దసరిగరీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ
రిగమ రిగమామ సరిగ సరిగాగ దసరి
పదమగారి సనిద పదగరీస
నిద పద రిసా నిద పసనిద పనిద మదపమ
గరిసరి గమ పద సరిగ..గోపాల జాగేలరా..ఆ
మగపదస మాగా మగగరిస దాసా
దరిసనిదపాదా సనిదపద..గోపాల జాగేలరా..ఆ
రిమపనిస రీరి రిమరిమ రిరిసని ససరి నినిస పపని
రిసని పమ రిరిమమ
నినిరీ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
రీపమరిసని సమరి మసరి నిరిసరి నిప మపనిసరి
మారీ రిసని రీసా సని పసారీ మపని..గోపాల జాగేలరా..ఆ
గాగరిరిగ రిగరిరిస సదగగ రిగగ సరిరి దసస
పదరిసరి దసదప పాదా
సారిగా..గగప గప గగరి రిరిగరిగరిరిస
ససరిసరిససద పాపదగరీ..ఈ
రీరీ గరిసద సానా రిసదప దాదా సదపద గపద గరిసా
దగారీ సాదప రీసాదాపగ సాదాపా గసరిగ పసదా
గారీరీసా రిసదపదసా..రిరిసారిరిదా సదవ గపదా
గరిసదగరీ..సదపగసదా..సదసపదగా..గపదాగరిసా
గరిసాపగరీ దపగా సదపా రిసగరి పగ దపసదరిస
రిగరిగ సరిస
దసద పద గారీ సద రీసా సదవ సారీ గపద..గోపాల జాగేలరా..ఆ

Tuesday, October 28, 2014

సూర్యకాంతం జననం


సూర్యకాంతం (Suryakantham), ఈ పేరు వింటేనే ఆంధ్రా కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో - ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజనట కళా శిరోమణి సూర్యకాంతం. విశేషం ఏమిటంటే, అత్తగారి పాత్రలో ఆమెకనిపించినా, అమెగయ్యాళే అని తెలిసినా - ఎన్ని సినిమాల్లో చూసినా ఏ మాత్రం విసుగు అనిపించకపోవడమే! ఒకే రకం పాత్రల్ని పోషించి - అంతకాలంపాటు, అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన.

ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు"

బాల్యం::
సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురం లో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది.

సినీ జీవితం::
మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది.

ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.

అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు.

ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.

నటనా శైలి::
సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. హాస్యనటుల పక్కన వేసింది గనక - హాస్యనటి అనిపించుకోవచ్చు. ఐతే ఆమె హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. ఏమైతేనేం - గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.

వ్యక్తిత్వం::
వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు - మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపులకోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. ఐతే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా - తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకీ వుండేది. విశేష దినాలూ, పండగపబ్బాలూవస్తే సరేసరి!

షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని ‘సైలెన్స్‌! అవుట్‌సైడ్‌’ అని ప్రొడక్షన్‌ మేనేజర్‌ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ‘ఓ!’ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే, ‘సైలెన్స్‌ అవుట్‌ సైడ్‌ - అని గదా అన్నారు!’ అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్య ను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం - క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు.

మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్‌ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే - ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీగాక! చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.

నటించిన సినిమాలు:
ధర్మాంగద (1949)
సంసారం (1950)
పెళ్ళిచేసి చూడు (1952)
బ్రతుకుతెరువు (1953)
కన్యాశుల్కం (1955) (మీనాక్షి)
దొంగరాముడు (1955)
చరణదాసి (1956)
శ్రీ గౌరీ మహత్యం (1956)
భాగ్యరేఖ (1957)
మాయాబజార్ (1957)
తోడికోడళ్ళు (1957)
దొంగల్లో దొర (1957)
అప్పుచేసి పప్పుకూడు (1959)
మాంగల్యబలం (1959)
కృష్ణలీలలు (1959)
భాగ్యదేవత (1959)
జయభేరి (1959)
శాంతినివాసం (1960)
ఇద్దరు మిత్రులు (1961)
పెళ్లికాని పిల్లలు (1961)
భార్యా భర్తలు (1961)
వాగ్దానం (1961)
వెలుగునీడలు (1961)
శభాష్ రాజా (1961
కలసి ఉంటే కలదు సుఖం (1961)
మంచిమనసులు (1962)
రక్తసంబంధం (1962)
సిరిసంపదలు (1962)
గుండమ్మకథ (1962)
తిరుపతమ్మకథ (1963)
నర్తనశాల (1963) (అథిది పాత్ర)
పరువు ప్రతిష్ఠ (1963)
చదువుకున్న అమ్మాయిలు (1963)
మురళీకృష్ణ (1964)
మూగమనసులు (1964)
డాక్టర్ చక్రవర్తి (1964)
ఉయ్యాల జంపాల (1965)
నవరాత్రి (1966)
సంగీతలక్ష్మి (1966)
ఆస్తిపరులు (1966)
కన్నెమనసులు (1966)
బ్రహ్మచారి (1967)
సుఖ దు:ఖాలు (1967)
ఉమ్మడికుటుంబం (1967)
అత్తగారు-కొత్తకోడలు (1968)
బుద్ధిమంతుడు (1969)
ఆత్మీయులు (1969)
బాలరాజు కథ (1970)
దసరాబుల్లోడు (1971)
అమాయకురాలు (1971)
కాలం మారింది (1972)
కొడుకు కోడలు (1972)
అందాల రాముడు (1973)
ముత్యాల ముగ్గు (1975)
సెక్రటరి (1976)
గోరంతదీపం (1978)
రాధాకృష్ణ (1978)
కార్తీక దీపం (1979) (శారదా తల్లి)
వియ్యాలవారి కయ్యాలు (1979)
చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
పెళ్ళిచూపులు (1983
బంధువులు వస్తున్నారు జాగ్రత్త (1989)
వన్ బయ్ టూ (1993).

Monday, October 27, 2014

జగదేకవీరుడు అతిలోకసుందరి--1990






సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::S.P.శైలజ 

పల్లవి::

ఆ ఆ ఆ ఆ..ఆ ఆ..ఆ ఆ ఆ ఆ   
జై చిరంజీవా..జగదేక వీరా..ఆ 
జై చిరంజీవా జగదేక వీరా 
అసహాయ శూరా అంజని కుమారా 
జై చిరంజీవా జగదేక వీరా 
అసహాయ శూరా అంజని కుమారా 
దీవించ రావయ్య..వాయు సంచారా 
రక్షించవేలయ్య..శ్రీరామ దూత 
జై చిరంజీవా..ఆఆఆ  

వీరాంజనేయా శూరాంజనేయ 
ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయా 
జై చిరంజీవా.. 
ఆరోగ్యదాతా అభయ ప్రదాతా..ఆ 
ఆరోగ్యదాతా అభయ ప్రదాతా 
ఉన్మాద భయ జాడ్య పీడా నివారా 
సంజీవి గిరివాహా..సానీరిసాహ 
సంజీవి గిరివాహ సానీరిసాహొ 
జై చిరంజీవా..ఆ..జగదేక వీరా..ఆ 

జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా 
జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా 
జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా

జగదేకవీరుడు అతిలోకసుందరి--1990


























సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,S.జానకి
Cast::Chiranjeevi...Andaalataara muddugumma Sreedevi

పల్లవి::

ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా ఢమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా..కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా..కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురో

చరణం::1

కసక్కు లయలు..హొయలు చూశా
కసెక్కి వలపు వలలే..వేశా
గుబుక్కు ఎదలో కథలే..దాచా
గుటుక్కు మనక గుబులే..దోచా
మజా చేస్తే మరోటంట..మరోటిస్తే మగాణ్ణంట
సరే అంటే అతుక్కుంటా..సరాగంలో ఇరుక్కుంటా
చుంబురుణ్ణై..నారదుణ్ణై
చుంబ మీద పంబ రేపి పాడుతుంటే మీరు గోవిందే
గోవిందా గోవింద come on..come on పాడండయ్యా
పబం పప్పా పబం పప్పా పబం పప్పా పబం పప్పా
పబం పం పాబం పపం పం పాబం పబం పం పాబా పాబా బాబాబం

ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా..కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురో

చరణం::2

వయస్సు ఒడిలో..చొడినే చూశా
వరించి సుడిలో..పడవే వేశా
నటించే నరుడా..ఘనుడా మెచ్చా
నమస్తే నడుమే..నటిగా ఇచ్చా
ఉడాయిస్తే ఉడుక్కుంటా..లడాయొస్తే హోయ్ ఉతుక్కుంటా
సఖి అంటే సరే అంటా..చెలి అంటే గురు అంటా
బ్రేకు డ్యాన్సు..షేకు డ్యాన్సు
mix చేసి steps వేసి tricks చేస్తే మీరు గోవింద
come on..come on dance I say ఆడండ్రా
ధినక్కుతా ధినక్కుతా..ధినక్కుతా ధినక్కుతా
ధినక్కు తార ధినక్కు తార..ధినక్కు తారా తారా తారారా

ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా..కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో..ఝనక్కుతా చమక్కురోయ్

జగదేకవీరుడు అతిలోకసుందరి--1990














సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,S.జానకి
Cast:::Chiranjeevi,Beauty Queen Sreedevi

పల్లవి::

మ్మ్ హూ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
ప్రియతమా నను పలకరించు..ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న..హృదయమా
బ్రతుకులోని బంధమా..పలుకలేని భావమా
మరువలేని స్నేహమా..మరలిరాని నేస్తమా
ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..ఆ

ప్రియతమా నను పలకరించు..ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న..హృదయమా
ఎదుటవున్న స్వర్గమా..చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా..కౌగిలింత ప్రాణమా
ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..ఆ

చరణం::1

నింగి వీణకేమో..నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు..అన్నీ కలిసి
పారిజాతపువ్వు..పచ్చి మల్లె మొగ్గ
వలపె తెలిపే నాలో విరిసి

మచ్చలెన్నో ఉన్న..చందమామకన్నా 
నరుడే వరుడై..నాలో మెరిసే
తారలమ్మకన్నా..చీరకట్టుకున్న 
పడుచుతనము..నాలో మురిసే

మబ్బులనీ..వీడిపోయి 
కలిసే నయనం..తెలిసే హృదయం
తారలన్నీ..దాటగానే 
తగిలే గగనం..రగిలే విరహం
రాయలేని భాషలో..ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో..ఎన్ని మూగపాటలో
అడుగే పడక..గడువే గడిచి పిలిచే
ప్రియతమా నను పలకరించు..ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న..హృదయమా

చరణం::2

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
తొంతననన తనతనతన తొంతననన
ప్రాణవాయువులో వేణువూదిపోయే..శృతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలాయే..మనసు మమత అన్నీ కలిసి
వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే..బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె..కులము గుణము అన్నీ కుదిరి

నీవులేని నింగిలోన..వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద..బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో..నీటికెన్ని రంగులో
అమృతాల విందులో..ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై..మిగిలే

ప్రియతమా నను పలకరించు..ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న..హృదయమా
బ్రతుకులోని బంధమా..పలుకలేని భావమా
కనులలోని కావ్యమా..కౌగిలింత ప్రాణమా
ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..ఆ

ప్రియతమా నను పలకరించు..ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న..హృదయమా

జగదేకవీరుడు అతిలోకసుందరి--1990



















సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి:

లా లా ల ల ల లా 
లా లా ల ల ల లా 
అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం 
పువ్వూ నవ్వూ పులకించే గాలిలో
నింగీ నేలా చుంబించే లాలిలో 
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం
నా చూపుకే శుభోదయం

చరణం::1

లతా లతా సరాగమాడే..సుహాసిని సుమాలతో 
వయస్సుతో వసంతమాడీ..వరించెలే సరాలతో 
మిలా మిలా హిమాలే..జలా జలా ముత్యాలుగా 
తళా తళా గళాన..తటిల్లతా హారాలుగా 
చేతులు తాకిన కొండలకే..చలనము వచ్చెనులే 
ముందుకు సాగిన ముచ్చటలో..మువ్వలు పలికెనులే 
ఒక స్వర్గం తలవంచి..ఇల చేరే క్షణాలలో 
అందాలలో అహో మహోదయం..భూలోకమే నవోదయం

చరణం::2

సరస్సులో శరత్తు కోసం..తపస్సులే ఫలించగా 
సువర్ణిక సుగంధమేదో..మనస్సునే హరించగా 
మరాళినై ఇలాగే..మరీ మరీ నటించనా 
విహారినై ఇవాళే..దివి భువి స్పృశించనా 
గ్రహములు పాడిన పల్లవికే..జాబిలి ఊగెనులే 
కొమ్మలు తాకిన ఆమనికే..కోయిల పుట్టెనులే 
ఒక సౌఖ్యం తనువంతా..చెలరేగే క్షణాలలో
అందాలలో అహో మహోదయం..భూలోకమే నవోదయం 
నీలాకాశం దిగివచ్చే లోయలో..ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో 
నాలో సాగే ఏదో సరాగమే
అందాలలో అహో మహోదయం..భూలోకమే నవోదయం

JagadekaVeerudu-AtilokaSundari--1990
Music::IlayaRaja
Lyrics::Veturi
Singer's::S.P.Balu,S.Janaki

andaalalo aho mahodayam 
bhoolokame navodayam 
puvvu navvu pulakinche gaalilo 
ningi nela chunbinche lalilo 
tarallara rare viharame 
andaalalo aho mahodayam 
na choopuke shubhodayam

lata lata saragamade suhasini sumaalato 
vayassuto vasantamadi varinchele saralato 
mila mila himale jala jala mutyaaluga 
tala tala galana tatillata haaraaluga 
chetulu takina kondalake chalanamu vacchenule 
munduku saagina muchhatalo muvvalu palikenule 
oka swargam talavanchi ila chere kshanalalo

andaalalo aho mahodayam bhoolokame navodayam 
puvvu navvu pulakinche gaalilo ningi nela chunbinche lalilo 
tarallara rare viharame 
andaalalo aho mahodayam na choopuke shubhodayam

sarassulo sharattu kosam tapassule phalinchaga 
suvarnika sugandhamedo manassune harinchaga 
maralinai ilaage maree maree natinchana 
viharinai ivaale divi bhuvi sprushinchana 
grahamulu padina pallavike jaabili oogenule 
kommalu takina amanike koyila puttenule 
oka soukhyam tanuvanta chelarege kshanalalo

andaalalo aho mahodayam bhoolokame navodayam 
neelaakasham digivachhe loyalo oohaalokam yedurochhe haayilo 
naalo sage yedo saraagame 
andaalalo aho mahodayam bhoolokame navodayam

జగదేకవీరుడు అతిలోకసుందరి--1990



























సంగీత::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు
తారాగణం::చిరంజీవి,శ్రీదేవి.

పల్లవి::

హే హే రపరపపర రపరపపర పా
హే హే రపరపపర రపరపపర పా
రపరపా రపరపా రప్పప్పా
రపరపా రపరపా రప్పప్పా

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట నా పేరే రాజు
ఎన్ పేర్‌దా రాజు మేరా నాం రాజు మై నేం ఈజ్ రాజూ

చరణం::1

భాయియో ఔర్ బెహ్‌నో
ఈ కొండ వీడు వైభవాన్నీ చూసి 
కన్ను కుట్టిన శత్రు రాజు ధూమ కేతు
తన సైన్యంతో దండెత్తి వచ్చాడు హా
అప్పుడు మన రాజసింహుడు తెలివిగా
ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో
శత్రుసైన్యం మీదికి మెరుపు దాడి చేశాడు

విజయుడై వచ్చినాడురా తన ప్రజలంతా మెచ్చినారురా
దుర్గమునే ఏలినాడురా ఆ స్వర్గమునే దించినాడురా
అక్షితలే చల్లినారు రమణులంతా
అహ హారతులే భక్తిమీర పట్టినారురా
సింహాసమెక్కి తాను విష్ణుమూర్తిలా
అహ సిరులెన్నో చెలువు మీద చెలికినాడురా

ఏ రాజు ఎవరైనా మా రాజువింక నువ్వంటా
నీ మనసే మా కోట మీ మాట మాకు పూబాటా
రాజాది రాజా మార్తాండ తేజ
నా పేరే రాజు మై నేం ఈజ్ రాజూ

చరణం::2

అందాల ఆ రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు
పెద్ద రాణి నాట్యంలో మయూరి
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
చిన్న రాణి సంగీతంలో దిట్ట సరిగమల పుట్ట
పద పద సాస సరి గరి సాపద
పద పద సాస సగరిగ సరి గస పద
దరి రిగ గస సప గరిస దప గారిస

కళలే పోషించినాడురా తను కావ్యాలే రాసినాడురా
శిలలే తెప్పించినాడురా ఘన శిల్పాలే మలచినాడురా
చెరువులెన్నో తవ్వించి కరువుమాపి
అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా
కులమతాల రక్కసిని రూపుమాపి
అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా
నీలాంటి రాజుంటే ఆ దేవుడింక ఎందుకంట
చల్లనైన నీ చూపే మాకున్న పండు ఎన్నెలంట
రాజాధి రాజా మార్తాండ తేజా
నా పేరే రాజు మేరా నాం రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట మమ నామ రాజు
ఎన్ పేర్‌దా రాజు
ఎండ వేరే రాజు
నన్న హెసరే రాజు
నా పేరే రాజు

లాయర్ సుహాసిని--1987
















సంగీత::S.P.బాలు
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు, S,P,శైలజ
తారాగణం::భానుచందర్,సుహాసిని,S.వరలక్ష్మీ 

పల్లవి::

ఆ..ఆ..ఆ..మ్మ్..మ్మ్..మ్మ్
సామజవరగమనా..ఆ
దివిని తిరుగు మెరుపు లలన..సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన..సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా

దివిని తిరుగు మెరుపు లలన..సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన..సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా


చరణం::1

అరవిరిసిన చిరునగవుల..సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు..సామజవరగమనా
అరవిరిసిన చిరునగవుల..సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు..సామజవరగమనా
సొగసులమణి నిగనిగమని..సామజవరగమనా
మెరిసిన గని మురిసెనుమది..సామజవరగమనా
వెలసెను వలపుల మధువని..సామజవరగమనా

దివిని తిరుగు మెరుపు లలన..సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన..సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా


చరణం::2

మమతల ఉలి మలచిన కల..సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల..సామజవరగమనా
మమతల ఉలి మలచిన కల..సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల..సామజవరగమనా
సుగుణములను తరగని గని..సామజవరగమనా
దొరికినదని ఎగసెను మది..సామజవరగమనా
అరుదగు వరమిది తనదని..సామజవరగమనా

హ..హా..హ..హా
దివిని తిరుగు మెరుపు లలన..సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన..సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన..సామజవరగమనా

Sunday, October 26, 2014

సాలూరు రాజేశ్వరరావు




సాలూరు రాజేశ్వరరావు సాలూరు మండలములోని శివరామపురం గ్రామంలో 1922 సంవత్సరంలో జన్మించాడు. రాజేశ్వరరావుకి అతి చిన్న వయసులోనే సంగీతం అబ్బింది. ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు వద్దే “సరిగమలు” దిద్దాడు. సన్యాసిరాజుగారు ప్రముఖ వాయులీన విద్వాంసులైన ద్వారం వెంకటస్వామి నాయుడుకి కచేరీలలో మృదంగంపై సహకరించిన వ్యక్తి. అలాగే అప్పట్లో మూకీ సినిమాలకు తెరముందు, హార్మోనియం వాద్యకారునిగా, సంగీతాన్ని వినిపించేవాడు. అంతేకాదు రాజేశ్వరరావు మంచి గేయ రచయిత కూడా! "ఆ తోటలోనొకటి ఆరాధనాలయము", "తుమ్మెదా! ఒకసారి మోమెత్తి చూడమని", "పొదరింటిలోనుండి పొంచి చూచెదవేల", "కలగంటి కలగంటి" లాంటి కొన్ని మంచి మంచి పాటల్ని ఇతని ద్వారానే మనకు లభించాయి.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు, నాలుగేళ్ళ వయసులోనే రాజేశ్వరరావు అనేక రాగాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మరో మూడేళ్ళు గడిచేసరికి అన్న హనుమంతరావుతో కలిసి పాట కచేరీలు ఇవ్వడం, హరికథలు చెప్పడం మొదలు పెట్టాడు. రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి హచ్చిన్స్‌ గ్రామఫోను కంపెనీ బెంగుళూరుకు ఆహ్వానించడం జరిగింది. 1933-34 మధ్యకాలంలో “బాల భాగవతార్‌ మాస్టర్‌ సాలూరి రాజేశ్వరావు ఆఫ్‌ విజయనగరం” కంఠం గ్రామఫోను రికార్డుల ద్వారా (భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు, మోతీలాల్‌ నెహ్రూ పై పాటలు మొదలగునవి) మొదటిగా విజయనగరం ఎల్లలు దాటి యావదాంధ్రదేశానికీ పరిచయమయింది.

సాలూరు రాజేశ్వరరావు (శలురు ఋఅజెస్వర ఋఅఒ) తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది

తియ్యటి బాణీల కమ్మటి పాటల మేటిగా ఆయన అందరికీ చిరపరిచితులు సాలూరు రాజేశ్వరరావుగారు..
సాలూరు రాజేశ్వరరావు తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది.
సాంఘికమైనా, పౌరాణికమైనా తను నమ్ముకున్న మెలొడీకి ప్రాధాన్యతనిస్తూ సంప్రదాయ రాగాల్లో వుండేటటువంటి మధురిమను వదులుకోకుండా చక్కని చిక్కని పాటలు అందించాడు.
ఈయన సుదూర సుస్వర సంగీతయాత్రలో 200కు పైగా చిత్రాలకు, ఎన్నో లలిత గీతాలకు, పెక్కు ప్రైవేటు రికార్డులకు సంగీతాన్ని అందించాడు. ఆయన 40 ఏళ్ళకు పైబడిన సినీ జీవితంలో కనీసం పేరైనా పేర్కొనవలసిన చిత్రాలు రాజు పేద (54), మిస్సమ్మ (1955), భలేరాముడు (1956), మాయాబజార్‌ (1957, 4 పాటలు మాత్రమే), అప్పుచేసి పప్పుకూడు, (1958), చెంచులక్ష్మి (1958), భక్త జయదేవ (1960), అమరశిల్పి జక్కన (1963), భక్త ప్రహ్లాద (1967). అభేరి (భీంపలాస్‌), కల్యాణి, మోహన, సింధుభైరవి,శంకరాభరణం ఈయనకు ప్రియమైన రాగాలు. శాస్త్రీయ రాగాల్లో ఆయన వినిపించిన వరసలను గురించి మరొక సుదీర్ఘమైన వ్యాసమే రాయవచ్చు. జగమే మారినది (కల్యాణి, దేశ ద్రోహులు 62), నా హృదయంలో నిదురించే చెలీ (శంకరాభరణం, ఆరాధన 62), పాడవేల రాధికా (మోహన, ఇద్దరు మిత్రులు 60), … లాంటి పాటలు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
కేవలం అనుసరించడం, అనుకరించడం కోసమై మన సంగీతానికి ప్రాణసమానమైన 'మెలొడీ' ని ఈతరంవారు మర్చిపోతున్నారు అని అన్న ఆయన మాటలు ఎంతయినా నిజం.
సాంఘికమైనా, పౌరాణికమైనా తను నమ్ముకున్న మెలొడీకి ప్రాధాన్యతనిస్తూ సంప్రదాయ రాగాల్లో వుండేటటువంటి మధురిమను వదులుకోకుండా చక్కని చిక్కని పాటలు అందించారు ...సాలూరు రాజేశ్వరరావు..
సినిమాల్లో వీణ, సితార్‌ వంటి వాయిద్యాలని పాటల ద్వారా పరాకాష్ఠకు తీసుకువెళ్ళింది సాలూరే.
‘‘నీవు లేక వీణ పలుకలేన న్నది’’ (డాక్టర్‌ చక్రవర్తి), ‘‘పాడెద నీ నామమే గోపాలా’’(అమాయకురాలు) వంటి పాటల్లో చరణానికి, చరణానికి మధ్య స్వరకల్పనలో వీణను పూర్తిగా వాడారు రాజేశ్వరరావు. ఏ రంగంలోనైనా క్రియేటివిటి కొంతవయస్సు వరకూ ఉండి తరువాత తగ్గడం సహజం. కానీ, రాజేశ్వర రావుకి వయస్సు మీద పడ్డా తగ్గలేదు. దానికి ఉదాహరణే 1977లో సాలూరి స్వరకల్పన చేసిన ‘‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు’’ పాట ఎప్పటికీ ఎవర్‌గ్రీనే.
అక్టోబర్‌ 26, 1999న కన్నుమూసిన సుస్వరాల రాజేశ్వరరావుకి నివాళులర్పించి ఓ సారి ఆయన్ని గుర్తుచేసుకుందాం. ఎనెన్నో అద్భుత స్వర కల్పనలు చేసిన సాలూరి తెలుగు పాట ఉన్నంత కాలం మనందరిలో సజీవుడే.
సాలూరు రాజేశ్వరరావు వర్ధంతి సందర్భం గా...అయన స్మరణలో మనం 

సిరి సిరి మువ్వ--1978::కానడ::రాగం




సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల    
Film Directed By::K.Viswanaath
తారాగణం:::చంద్రమోహన్,జయప్రద,సత్యనారాయణ,దేవదాసు,రమణమూర్తి,సాక్షీరంగారావు,అల్లురామలింగయ్య,రమాప్రభ,నిర్మల,కవిత.

కానడ::రాగం
(హిందుస్తానీ ~ కర్నాటక)

పల్లవి::

రారా స్వామి రారా
యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా
శతకోటి మన్మధాకారా
స్వరరాగ సుధారస వీరా స్వామి రారా
నా పాలి దిక్కు నీవేరా
నీ పదములంటి మ్రొక్కేరా
నీ దానరా రావేలరా నన్నేలరా
భరత శాస్త్ర సంభరిత పదద్వయ
చరిత నిరత సమధుర మంగళ గళ రారా స్వామీ రారా 

రాగాలెన్నో పండిన గారాల నీ మెడలో
అనురాగ మూలకలే వేయాలని
నీ చల్లని చరణాలు చల్లిన కిరణాలలో
రేపటి కోసం చీకటి రెప్పల తెర తీయాలని 

పిలిచాను ఎదుట నిలిచాను
కోరి కోరి నిన్నే వలచాను 
పిలిచాను ఎదుట నిలిచాను
కోరి కోరి నిన్నే వలచాను 

చరణం::1

గంగ కదిలి వస్తే కడలి ఎలా పొంగిందో
యమున సాగివస్తే ఆ గంగ ఏమి పాడిందో
ఆమని వచ్చిన వేళ అవని ఎంత మురిసిందో
మోహన వేణువు తాకిన మోవి ఎలా మెరిసిందో

ఊగింది తనువు అలాగే..పొంగింది మనసు నీలాగే
ఊగింది తనువు అలాగే..పొంగింది మనసు నీలాగే  

చరణం::2

శృతి కలిపిందెన్నడో సిరిసిరిమువ్వల సవ్వడిలో
జత కలిసిందిప్పుడే ఆ గుడిలో నీ ఒడిలో
శృతి కలిపిందెన్నడో సిరిసిరిమువ్వల సవ్వడిలో
జత కలిసిందిప్పుడే ఆ గుడిలోన నీ ఒడిలో

మువ్వనై పుట్టాలని అనుకున్నా నొకనాడు
మువ్వనై పుట్టాలని అనుకున్నా నొకనాడు
దివ్వెనై నీ వెలుగులు రువ్వనీ యీ నాడు 

Siri siri muvva--1978
Music::K.V. Mahadevan
Lyrics::Vetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Viswanaath
Cast:::Chandramohan,Jayaprada,Satyanaaraayana,Devadaasu,Ramanamoorti,Saakshiirangaarao,Alluraamalingayya,Ramaaprabha,Nirmala,Kavita.

pallavi::

raaraa swaami raaraa
yaduvamSa sudhaambudhi chandra swaami raaraa
SatakOTi manmadhaakaaraa
swararaaga sudhaarasa veeraa swaami raaraa
naa paali dikku neevEraa
nee padamulanTi mrokkEraa
nee daanaraa raavElaraa nannElaraa
bharata Saastra sambharita padadvaya
charita nirata samadhura mangaLa gaLa raaraa swaamee raaraa 

raagaalennO panDina gaaraala nee meDalO
anuraaga moolakalE vEyaalani
nee challani charaNaalu challina kiraNaalalO
rEpaTi kOsam cheekaTi reppala tera teeyaalani 

pilichaanu eduTa nilichaanu
kOri kOri ninnE valachaanu 
pilichaanu eduTa nilichaanu
kOri kOri ninnE valachaanu 

::::1

ganga kadili vastE kaDali elaa pongindO
yamuna saagivastE aa ganga Emi paaDindO
aamani vachchina vELa avani enta murisindO
mOhana vENuvu taakina mOvi elaa merisindO

oogindi tanuvu alaagE..pongindi manasu neelaagE
oogindi tanuvu alaagE..pongindi manasu neelaagE  

::::2


SRti kalipindennaDO sirisirimuvvala savvaDilO
jata kalisindippuDE aa guDilO nee oDilO
SRti kalipindennaDO sirisirimuvvala savvaDilO
jata kalisindippuDE aa guDilOna nee oDilO

muvvanai puTTaalani anukunnaa nokanaaDu
muvvanai puTTaalani anukunnaa nokanaaDu
divvenai nee velugulu ruvvanee yee naaDu 

వరకట్నం--1968

సంగీతం::T.V.రాజు
రచన::కోసరాజురాఘవయ్య
గానం::జిక్కి,P.సుశీల 
Film Director::N.T.Rama Rao
తారాగణం::N.T.R.,సత్యనారాయణ,ప్రభాకర్‌రెడ్డి,రాజనాల,నాగభూషణం,అల్లురామలింగయ్య,రావికొండలరావు,మిక్కిలినేని,రేలంగి,పద్మనాభం,సూర్యకాంతం,పెరుమాళ్ళు,చంద్రకళ,హేమలత,సావిత్రి,క్రిష్ణకుమారి. 

పల్లవి::

పుట్టలోని నాగన్న..లేచి రావయ్య
స్వామీ..పైకి రావయ్యా
గుమ్మపాలు తెచ్చినాము..తాగిపోవయ్యా
వేయి దండాలయ్యా..వేయి దండాలయ్యా..ఆఆఅ 

పుట్టలోని నాగన్న..లేచి రావయ్య
స్వామీ..పైకి రావయ్యా

చరణం::1

నీ కోరల్లో విషము..దాచుకోవయ్యా
నీ బుసకొట్టే కోపం..ఆపుకోవయ్యా
మనసులోని కోరికలు..మక్కువతో తీరిస్తే
మరువక నాగుల చవితి..పూజ మేము చేసేము 

పుట్టలోని నాగన్న..లేచి రావయ్య
స్వామీ..పైకి రావయ్యా

చరణం::2

ప్రాణాచారంబడ్డ..నాంచారమ్మా
గుట్టుగా ఏమని..కోరినావమ్మా
నువ్వు గుట్టుగా ఏమని..కోరినావమ్మా  
మంచి మొగుడు కావాలని..మోజుపడ్డావా
చిట్టి పాప ఫూట్టాలని..మొక్కుకున్నావా?
అనుకున్నది అయితేను..ముడుపులు చెల్లిస్తానని
అనవే అనవేమే..నువ్వనవే నువ్వనవే..హాహాహా 

పుట్టలోని నాగన్న..లేచి రావయ్య
స్వామీ..పైకి రావయ్యా

చరణం::3

మా పసుపు కుంకుమా..ఎప్పుడు పచ్చగుండాలి
మా పిల్లాపాప..చల్లగ వర్థిల్లాలి
మేము పట్టినదంతా..ఎప్పుడు బంగారం కావాలి
ఏటేటా నిన్నే..మా యిలవేల్పుగ కొలవాలీ

పుట్టలోని నాగన్న..ఏలుకోవయ్యా
నీవే మా స్వామివని..నమ్మినామయ్యా
నీకు దండాలయ్యా..వేయి దండాలయ్యా
కోటి దండాలయ్యా..ఆ

Varakatnam--1968
Music::T.V.Raaju
Lyrics::Kosaraajuraaghavayya
Singer's::Jikki,P.Suseela 
Film Director::N.T.Rama Rao
Cast::N.T.R.,Satyanaaraayana,PrabhaakarReddi,Raajanaala,Naagabhooshanam,Alluraamalingayya,RaavikondalaRao,Mikkilineni,Relangi,Padmanaabham,Sooryakaantam,Perumaallu,Chandrakala,Hemalata,Saavitri,Krishnakumaari. 

:::::::::::::::::::::::::::::::::::::::

puTTalOni naaganna..lEchi raavayya
swaamii..paiki raavayyaa
gummapaalu techchinaamu..taagipOvayyaa
vEyi danDaalayyaa..vEyi danDaalayyaa..aaaaa 

puTTalOni naaganna..lEchi raavayya
swaamii..paiki raavayyaa

::::1

nee kOrallO vishamu..daachukOvayyaa
nee busakoTTE kOpam..aapukOvayyaa
manasulOni kOrikalu..makkuvatO teeristE
maruvaka naagula chaviti..pooja mEmu chEsEmu 

puTTalOni naaganna..lEchi raavayya
swaamii..paiki raavayyaa

::::2

praaNaachaarambaDDa..naanchaarammaa
guTTugaa Emani..kOrinaavammaa
nuvvu guTTugaa Emani..kOrinaavammaa  
manchi moguDu kaavaalani..mOjupaDDaavaa
chiTTi paapa PuTTaalani..mokkukunnaavaa?
anukunnadi ayitEnu..muDupulu chellistaanani
anavE anavEmE..nuvvanavE nuvvanavE..haahaahaa 

puTTalOni naaganna..lEchi raavayya
swaamii..paiki raavayyaa

::::3

maa pasupu kunkumaa..eppuDu pachchagunDaali
maa pillaapaapa..challaga varthillaali
mEmu paTTinadantaa..eppuDu bangaaram kaavaali
ETETaa ninnE..maa yilavElpuga kolavaalii

puTTalOni naaganna..ElukOvayyaa
neevE maa swaamivani..namminaamayyaa
neeku danDaalayyaa..vEyi danDaalayyaa
kOTi danDaalayyaa..aa

ఛాయ--1979



సంగీతం::సత్యం
రచన::D.C..నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Hanumaan Prasaad
తారాగణం::సత్యేంద్ర కుమార్,రూపాదేవి

పల్లవి::

ఎంత వలపో..సాగరునిపై గోదారికీ
ఎనెన్ని పరుగులో..ఆ సాగర సంగమానికీ

ఎంత వలపో..సాగరునిపై గోదారికీ
ఎనెన్ని పరుగులో..ఆ సాగర సంగమానికీ

చరణం::1

ఏముంది తనకూ..నిరుపేద మనసు
ఇంకేముంది తనకూ..వగలే లేని సొగసూ

ఏముంది తనకూ..నిరుపేద మనసు
ఇంకేముంది తనకూ..వగలే లేని సొగసూ

ఏ సిరులూ లేని..ఈ వాగు చెలిమీ
ఏ సిరులూ లేని..ఈ వాగు చెలిమీ
ఆ కడలి నేడూ..అలరించునా
అలరించునా..కరమందించునా

ఎంత వలపో..సాగరునిపై గోదారికీ
ఎనెన్ని పరుగులో..ఆ సాగర సంగమానికీ

చరణం::2

ఉన్నాయి తనలో..ఎనెన్ని సిరులు
దాగున్నాయి తనలో..ఏవేవో కోరికలు

ఉన్నాయి తనలో..ఎనెన్ని సిరులు
దాగున్నాయి తనలో..ఏవేవో కోరికలు

అందుకే ఆ కడలికి..అంతటి కలవరం
అందుకే ఆ కడలికి..అంతటి కలవరం

అది కోరుకొంటుంది..ఆ నదీ సంగమం
ఆ నది సంగమం..గోదావరీ సంగమం

ఎంత వలపో..సాగరునిపై గోదారికీ
ఎనెన్ని పరుగులో..ఆ సాగర సంగమానికీ

Chaaya--1979
Music::Satyam
Lyrics::D.C.NaaraayanaReddi
Singer's::S.P.Baalu.P.Suseela
Film Directed By::Hanumaan Prasaad
Cast::SatyEndra Komaar,Roopa,Nootanaprasaad,

::::::::::::::::::::::::::::

enta valapO..saagarunipai gOdaarikii
enenni parugulO..aa saagara sangamaanikii

enta valapO..saagarunipai gOdaarikii
enenni parugulO..aa saagara sangamaanikii

::::1

Emundi tanakuu..nirupEda manasu
inkEmundi tanakuu..vagalE lEni sogasuu

Emundi tanakuu..nirupEda manasu
inkEmundi tanakuu..vagalE lEni sogasuu

E siruluu lEni..ii vaagu chelimii
E siruluu lEni..ii vaagu chelimii
A kaDali nEDuu..alarinchunaa
alarinchunaa..karamandinchunaa

enta valapO..saagarunipai gOdaarikii
enenni parugulO..aa saagara sangamaanikii

::::2

unnaayi tanalO..enenni sirulu
daagunnaayi tanalO..EvEvO kOrikalu

unnaayi tanalO..enenni sirulu
daagunnaayi tanalO..EvEvO kOrikalu

andukE A kaDaliki..antaTi kalavaram
andukE A kaDaliki..antaTi kalavaram

adi kOrukonTundi..A nadii sangamam
A nadi sangamam..gOdaavarii sangamam

enta valapO..saagarunipai gOdaarikii
enenni parugulO..aa saagara sangamaanikii

Saturday, October 25, 2014

స్వయంవరం--1982



సంగీతం::సత్యం
రచన::దాసరి
గానం::S.P.బాలు
Film Directed By::DasariNaraayana Rao
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,దాశరినారాయణరావు,రావుగోపాల్‌రావు,గుమ్మడి.

పల్లవి::

ముసుగేసిన..మబ్బులలో
మసకేసిన..పరదాలలో
దాగిదాగి ఉన్న..జాబిల్లి
ఒకసారినువ్వు..రావాలి
ఒక మాట నే..చెప్పాలి
నీతో మాట చెప్పి పోవాలి 

ముసుగేసిన..మబ్బులలో
మసకేసిన..పరదాలలో
దాగిదాగి ఉన్న..జాబిల్లి
ఒకసారినువ్వు..రావాలి
ఒక మాట నే..చెప్పాలి
నీతో మాట చెప్పి పోవాలి 
ఆహా..ఆ..ఆఆఆఆఆ..ఆ..ఆ  
ఆ..ఆఆఆఆఆ..ఆ..ఆ..ఆఆ..ఆఆ

చరణం::1

ఏహృదయం.. నిను మార్చిందో
మనసు..మార్చుకున్నావు
ఏ విధి నాపై..పగపట్టిందో
తెరలు..తెంచుకున్నావు 
అవధులు..లేని అనురాగానికి 
అనుమానం..పొగమంచు అని
మంచు కరిగిన..మరు నిముషంలో
అనురాగం..ఒక కోవేలని
తెలియక..తొందర పడ్డావు 
తెలియక..తొందర పడ్డావు 
ఈ ప్రశ్నకు..బదులేమిస్తావు
ఈ ప్రశ్నకు..బదులేమిస్తావు
ఒకసారి నువ్వు..రావాలి
ఒక మాట..నే చెప్పాలి
నీతో మాట..చెప్పి పోవాలి

చరణం::2

ఏ రాహువు నిను..మింగిందో   
కనుమరుగై..పోయావు
ఏ గ్రహణం..నిను పట్టిందో 
నను దూరం..చేశావు
వెన్నెల కురిసే..ఆకాశంలో  
అమావాస్య..ఒక నల్ల మబ్బని
మబ్బు తొలగిన..మరు నిముషంలో
వెన్నెలదే..ఆకాశమని
తెలియక..తొందర పడ్డావు..ఊఊఊఊఊఊ
తెలియక..తొందర పడ్డావు 
ఈ ప్రశ్నకు..బదులేమిస్తావు
ఈ ప్రశ్నకు..బదులేమిస్తావు
ఒకసారి నువ్వు..రావాలి
ఒక మాట..నే చెప్పాలి
నీతో మాట..చెప్పి పోవాలి
ముసుగేసిన..మబ్బులలో
మసకేసిన..పరదాలలో..ఓఓ
దాగిదాగి ఉన్న..జాబిల్లి
ఒకసారి నువ్వు..రావాలి
ఒక మాట..నే చెప్పాలి
నీతో మాట..చెప్పి పోవాలి

Swayamvaram--1981
Music::Satyam
Lyrics::Daasari
Singer's::S.P.Baalu
Film Directed By::DasariNaraayana Rao
Cast::SObhan Baabu,Jayaprada,Daasarinaaraayanarao,RaogOpaal Rao,Gummadi.

:::::::::::::::

musugEsina..mabbulalO
masakEsina..paradaalalO
daagidaagi unna..jaabilli
okasaarinuvvu..raavaali
oka maaTa nE..cheppaali
neetO maaTa cheppi pOvaali 

musugEsina..mabbulalO
masakEsina..paradaalalO
daagidaagi unna..jaabilli
okasaarinuvvu..raavaali
oka maaTa nE..cheppaali
neetO maaTa cheppi pOvaali 
aahaa..aa..aaaaaaaaaa..aa..aa  
aa..aaaaaaaaaa..aa..aa..aaaa..aaaa

::::::1

E hRdayam.. ninu maarchindO
manasu..maarchukunnaavu
E vidhi naapai..pagapaTTindO
teralu..tenchukunnaavu 
avadhulu..lEni anuraagaaniki 
anumaanam..pogamanchu ani
manchu karigina..maru nimushamlO
anuraagam..oka kOvElani
teliyaka..tondara paDDaavu 
teliyaka..tondara paDDaavu 
ii praSnaku..badulEmistaavu
ii praSnaku..badulEmistaavu
okasaari nuvvu..raavaali
oka maaTa..nE cheppaali
neetO maaTa..cheppi pOvaali

:::::2

E raahuvu ninu..mingindO   
kanumarugai..pOyaavu
E grahaNam..ninu paTTindO 
nanu dooram..chESaavu
vennela kurisE..aakaaSamlO  
amaavaasya..oka nalla mabbani
mabbu tolagina..maru nimushamlO
venneladE..aakaaSamani
teliyaka..tondara paDDaavu..oooooooooooo
teliyaka..tondara paDDaavu 
ii praSnaku..badulEmistaavu
ii praSnaku..badulEmistaavu
okasaari nuvvu..raavaali
oka maaTa..nE cheppaali
neetO maaTa..cheppi pOvaali
musugEsina..mabbulalO
masakEsina..paradaalalO..OO
daagidaagi unna..jaabilli
okasaari nuvvu..raavaali
oka maaTa..nE cheppaali
neetO maaTa..cheppi pOvaali

ఏజెంట్ గోపి--1978



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు, 
తారాగణం::కృష్ణ,జయప్రద,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,జయమాలిని,హలం

పల్లవి::

ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
అది కట్టుకోక..ముడి పెట్టు కోక
వెళ్ళలేవు అడిగింది ఇచ్చుకోక..ఆ
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక 

చరణం::1

నా చూపుకు తెలుసు..ఆ లోపలి సొగసు
నా మనసుకు తెలుసు..నీ దాగని వయసు
కొండల నడుమ కోనొకటుంది..కోనకు నడుము నే కోరినదుంది
ఛీ ఫో
గుట్టూమట్టూ అవతల పెట్టు..అడిగిందిస్తే అవుతా జట్టు
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక 

చరణం::2  

రుసరుసలాడే చినదానా..అసలు విషయం దాచినదానా
రుసరుసలాడే చినదానా..అసలు విషయం దాచినదానా

బుసకొట్టే రూపం..కసి పట్టే కోపం
ఉసిగొల్పే తాపం..ఉడికిస్తే పాపం
కిక్కురుమనక పక్కకు వస్తే  ఉక్కిరిబిక్కిరి చేసేస్తా
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక 


చరణం::3  

అహా..హహా..హెహెహెహ్హెహే..అహహహ్హహహహా
చెరువున పడితే..నువు చేపవు అయితే
నా చూపులతోనే..నేగాళం వేస్తా
చకచకమంటే..నను తికమక పెడితే
నీ పంతం పడతా..నీ తళుకే చూస్తా
కస్సుబుస్సు కాదనవద్దు..దెబ్బకు చిత్తు అమ్మడి సొత్తు
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు ఉమ్మ్ ఉమ్మ్ సన్న రైక 
అది కట్టుకోక..ముడి పెట్టు కోక
వెళ్ళలేవు అడిగింది ఇచ్చుకోక..ఆ
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక 


Krishnarjulu--1982
Music::Challapalli Satyamn
Lyrics::Arudra 
Singer::S.P.Baalu. 
Film Directed By::K.S.R.Daas
Cast::Krshna,Jayaprada,Padmanabham,PrabhakarReddi,Jayamaalini,Halam

::::

unna sOku daachukOdu ulli kOka
unna chOTu daacha lEdu sanna raika
unna sOku daachukOdu ulli kOka
adi unna chOTu daacha lEdu sanna raika
adi kaTTukOka..muDi peTTu kOka
veLLalEvu aDigindi ichchukOka..aa
unna sOku daachukOdu ulli kOka
adi unna chOTu daacha lEdu sanna raika 

::::1

naa choopuku telusu..aa lOpali sogasu
naa manasuku telusu..nee daagani vayasu
konDala naDuma kOnokaTundi..kOnaku naDumu nE kOrinadundi
Chee phO
guTToomaTToo avatala peTTu..aDigindistE avutaa jaTTu
unna sOku daachukOdu ulli kOka
adi unna chOTu daacha lEdu sanna raika 

::::2  

rusarusalaaDE chinadaanaa..asalu vishayam daachinadaanaa
rusarusalaaDE chinadaanaa..asalu vishayam daachinadaanaa

busakoTTE roopam..kasi paTTE kOpam
usigolpE taapam..uDikistE paapam
kikkurumanaka pakkaku vastE  ukkiribikkiri chEsEstaa
unna sOku daachukOdu ulli kOka
adi unna chOTu daacha lEdu sanna raika 


::::3  

ahaa..hahaa..hehehehhehE..ahahahhahahahaa
cheruvuna paDitE..nuvu chEpavu ayitE
naa choopulatOnE..nEgaaLam vEstaa
chakachakamanTE..nanu tikamaka peDitE
nee pantam paDataa..nee taLukE choostaa
kassubussu kaadanavaddu..debbaku chittu ammaDi sottu
unna sOku daachukOdu ulli kOka
adi unna chOTu umm umm sanna raika 
adi kaTTukOka..muDi peTTu kOka
veLLalEvu aDigindi ichchukOka..aa
unna sOku daachukOdu ulli kOka
adi unna chOTu daacha lEdu sanna raika  

Tuesday, October 21, 2014

కోకిల--1989



సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు, K.S.చిత్ర
Directed & Produced by::Geetha Krishna
తారాగణం::సురేష్,శోభన,శరత్‌బాబు,గీత,రంగనాథ్,రావ్ C.S.R.,బ్రహ్మనందం.  

పల్లవి::

కోకిల..కోకిల..కోకిల
ఏయ్..ఏయ్..నే కావాలా?..హహహా
కోకిలా..కొ క్కొ కోకిల
కూతలా..రసగీతలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా 
ఐ లవ్ యూ..రేయ్ నువ్వు కాదురా ఐ లవ్ యూ..నేనురా
హ హ హ..ఐ లవ్ యూ..ఐ లవ్ యూ 
ఐ లవ్ యూ..ఐ లవ్ యూ
ఐ లవ్ యూ..ఐ లవ్ యూ

చరణం::1

జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే..నీ పాట వింటే
ఆకాశ దేశాన తారమ్మలాడే..నీ కొమ్మ వాకిటే
ముక్కమ్మ కోపం..ఛీఫో
ముద్దొచ్చె రూపం..వదులు
కన్నుల్లో తాపం..హహహ
వెన్నెల్లో దీపం..హోయ్
నాలోని లల్లాయికే..నీకింక జిల్లాయిలే
లయలేమో హొయలేమో ప్రియభామ కథలేమో
కోకిల కొ క్కొ కోకిల..కూతలా రసగీతలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
ఐ లవ్ యూ..ఐ లవ్ యూ
ఐ లవ్ యూ..ఐ లవ్ యూ
ఐ లవ్ యూ

చరణం::2

హే..హే..కొమ్మ పండే..కొమ్మ పండే
రెమ్మ పండే..రెమ్మ పండే
కొమ్మ పండే..రెమ్మ పండే..కొరుక్కు తింటావా
కొమ్మ పండే..రెమ్మ పండే..కొరుక్కు తింటావా
బుగ్గా పండే..బుగ్గా పండే
సిగ్గు పండే..సిగ్గు పండే
బుగ్గా పండే..సిగ్గు పండే..కొనుక్కుపోతావా
బుగ్గా పండే..సిగ్గు పండే..కొనుక్కుపోతావా
కొండల్లో వాగమ్మ కొంకర్లుపోయే నీ గాలి సోకే
ఈ చైత్రమాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే
పైటమ్మ జారే..ప్రాణాలు తోడే
వయ్యారమంతా..వర్ణాలు పాడే
జాలీగా నా జావళీ..హాలీడే పూజావళి
ఇక చాలు సరసాలు..ముదిరేను మురిపాలు
కోకిలా..కొ క్కొ కోకిల
కు కు కూతలా రసగీతలా..అహహహా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ..ఐ లవ్ యూ
ఐ లవ్ యూ..ఐ లవ్ యూ
ఐ లవ్ యూ..ఐ లవ్ యూ

Friday, October 17, 2014

కల్యాణ రాముడు--1980



సంగీతం::ఇళయరాజా 
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు
తారాగణం::కమల్‌హాసన్,శ్రీదేవి,పుష్పలత,మనోరమ.   

పల్లవి::

ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా

ఆహా..కన్నె చిలక
అహహా..కోరివచ్చా
నీకే మనసు ఇచ్చా
అందుకే కోరి వచ్చా
నాలో ప్రాణం నీవనీ నిజమనీ
వలపుల పాటలు పాడవచ్చా
నీకే మనసు ఇచ్చా
అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా
అందుకే కోరి వచ్చా

చరణం::1

గాడిద పోలిన నడకలో
ఆ కాకిని పోలిన గొంతులో
అ..ఆ..హంసను మించిన నడకలో
కోకిల నే మించిన గొంతులో
ఆశలు పొంగే పొంగి పొంగే
ఆశలు పొంగే పొంగి పొంగే
ఆతరువాతా..మరచిపోయా..ఆ
ఆ..జ్ఞాపకం వచ్చె నాకూ
నీవు నా చిట్టి రాణీ..ఈ

నీకే మనసు ఇచ్చా
అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా
అందుకే కోరి వచ్చా

చరణం::2

తీయని ముద్దొకటి ఇవ్వరాదే
నా కోరిక తీర్చుట తప్పుకాదే
తీయని ముద్దొకటి ఇవ్వరాదే
నా కోరిక తీర్చుట తప్పుకాదే
చక్కని చిలకా..టక్కరి నక్కా
అయ్యయ్యయ్యో..మరచిపోయా
ఆ..చక్కని చిలకా..చక్కెర రంగులరవ్వా
జాజి పూవా..నా మనసు ఇ చ్చా
మోజే మోసుకొచ్చా..

నీకే మనసు ఇచ్చా
అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా
అందుకే కోరి వచ్చా

చరణం::3

తరగని ఊహలు రేగెనే
నా తలపులు ఊయలలూగెనే
తరగని ఊహలు రేగెనే
నా తలపులు ఊయలలూగెనే
కనకరించీ..పలకరించీ
చేర రావే..కలిసిపోవే
పాడవేల నాతో..తోడుగా చిట్టిరాణీ

నీకే మనసు ఇచ్చా
అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా
అందుకే కోరి వచ్చా

నాలో ప్రాణం నీవనీ నిజమనీ
వలపుల పాటలు పాడవచ్చా
నీకే మనసు ఇచ్చా
అందుకే కోరి వచ్చా

Kalyana Ramudu--1980  
Music Director::IlayaRaja
Lyrics::Rajasree
Singer's::S.Janaki , S.P.Balu
Starring::KamalHaasan,Sreedevi,Pushpalata,Manorama.

::::::::

aahaa aahaa aahaa aahaa aahaa aahaa

aahaa..kanne chilaka
ahahaa..kOrivachchaa
neekE manasu ichchaa
andukE kOri vachchaa
naalO praaNam neevanii nijamanii
valapula paaTalu paaDavachchaa
neekE manasu ichchaa
andukE kOri vachchaa
neekE manasu ichchaa
andukE kOri vachchaa

::::1

gaaDida pOlina naDakalO
aa kaakini pOlina gontulO
a..aa..haMsanu minchina naDakalO
kOkila nE minchina gontulO
ASalu pongE pongi pongE
ASalu pongE pongi pongE
Ataruvaataa..marachipOyaa..aa
aa..jnaapakam vachche naakuu
neevu naa chiTTi raaNii..ii

neekE manasu ichchaa
andukE kOri vachchaa
neekE manasu ichchaa
andukE kOri vachchaa

::::2

teeyani muddokaTi ivvaraadE
naa kOrika teerchuTa tappukaadE
teeyani muddokaTi ivvaraadE
naa kOrika teerchuTa tappukaadE
chakkani chilakaa..Takkari nakkaa
ayyayyayyO..marachipOyaa
aa..chakkani chilakaa..chakkera rangularavvaa
jaaji poovaa..naa manasu i chchaa
mOjE mOsukochchaa..

neekE manasu ichchaa
andukE kOri vachchaa
neekE manasu ichchaa
andukE kOri vachchaa

::::3

taragani Uhalu rEgenE
naa talapulu UyalaloogenE
taragani Uhalu rEgenE
naa talapulu UyalaloogenE
kanakarinchii..palakarinchii
chEra raavE..kalisipOvE
paaDavEla naatO..tODugaa chiTTiraaNii

neekE manasu ichchaa
andukE kOri vachchaa
neekE manasu ichchaa
andukE kOri vachchaa

naalO praaNam neevanii nijamanii
valapula paaTalu paaDavachchaa
neekE manasu ichchaa
andukE kOri vachchaa

Saturday, October 11, 2014

బొబ్బిలి సింహం--1994



సంగీతం::M.M.కీరవాణి
రచన::జాలాది
గానం::S.P.బాలు,K.S.చిత్ర
Film Directed By::A.Kodandarami Reddy
తారాగణం::నందమూరిబాలకృష్ణ,శరత్‌బాబు,సత్యనారాయణ,జగ్గయ్య,కోటాశ్రీనివాసరావి,బ్రహ్మానందం,తణికెళ్ళభరణి,రాళ్ళపల్లి,చలపతిరావు,చిట్టిబాబు,శారద,రోజ,మీన, 

పల్లవి::

శ్రీరస్తూ శుభమస్తూ కొత్తపెళ్లి కూతురా కళ్యాణమస్తు
శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు
మా గుండె గుడిలో ఆశల ఒడిలో జ్యోతిని వెలిగించగా
శ్రీరస్తూ శుభమస్తూ కొత్తపెళ్లి కూతురా కళ్యాణమస్తు

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఏ పూజకేపువ్వు ఋణమై పూసిందో కాలానికే తెలుసటా
ఆ కాలం కనుమూస్తే కలగా చెరిగేది జీవితమొకటేనటా
సవతిగ కాకుండ చెల్లిగ నను చూసి తల్లిని చేశావుగా
ఈ పారాని పాదాలు సేవించినా గాని ఋణమే తీరదుగా
ఇది కలకాలమై ఉండగా..ఆఆఆఅ 
నీ అనుబంధమే పండగా..ఆఆఆఅ
ఇంటికి దీపం ఇల్లాలనిపించు నా ముద్దు చెల్లాయిగా

శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు

చరణం::2

ఎదిగే మరణాన్ని ఎదలో దాచేసి కథగాచే దేవుడు
పంతాల గిరి గీసి ప్రణయాన్ని ఉరివేసి మోసం చేశాడు
రాగాలు వెన్నెల్ని రాహువుతో చంపి చీకటి మిగిలించితే
ఆ వేకువలా మళ్ళి రేకులు వెదజల్లి రవియే పుడతాడులే
ఆ దీపంలో నీ రూపమే..ఏఏఏ..పూపాపల్లె ఆడాలని
ఊపిరి ఉయ్యాలై ఊసుల జంపాలై ఒడిలో ఆడేనులే

శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు
శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు

Bobbili Simham--1994
Music::M.M.Keeravaani
Lyrics::Jaalaadi
Singer's::S.P.Baalu.K.S.Chitra
Film Directed By::A.Kodandarami Reddy
Cast::Nandamuri Balakrishna, Roja, Meena, Satyanarayana, Sharada, Jaggayya, Sarath Babu, Kota Srinivasa Rao, Brahmanandam, Tanikella Bharani, Rallapalli, Chalapathi Rao, Chitti Babu.

::::::::::::::::::::::::::::::::::::::::::

Sreerastoo Subhamastoo kottapeLli kooturaa kaLyaaNamastu
Sreerastoo Subhamastoo maa inTi dEvataa saubhaagyamastu
maa gunDe guDilO aaSala oDilO jyOtini veliginchagaa
Sreerastoo Subhamastoo kottapeLli kooturaa kaLyaaNamastu

::::1

aa aa aa aa aa aa aa aa aa aa aa 
E poojakEpuvvu RuNamai poosindO kaalaanikE telusaTaa
aa kaalam kanumoostE kalagaa cherigEdi jeevitamokaTEnaTaa
savatiga kaakunDa chelliga nanu choosi tallini chESaavugaa
ii paaraani paadaalu sEvinchinaa gaani RuNamE teeradugaa
idi kalakaalamai unDagaa..aaaaaaa 
nee anubandhamE panDagaa..aaaaaaa
inTiki deepam illaalanipinchu naa muddu chellaayigaa

Sreerastoo Subhamastoo maa inTi dEvataa saubhaagyamastu

::::2

edigE maraNaanni edalO daachEsi kathagaachE dEvuDu
pantaala giri geesi praNayaanni urivEsi mOsam chESaaDu
raagaalu vennelni raahuvutO champi cheekaTi migilinchitE
aa vEkuvalaa maLLi rEkulu vedajalli raviyE puDataaDulE
aa deepamlO nii roopamE..EEE..poopaapalle aaDaalani
uupiri uyyaalai uusula jampaalai oDilO aaDEnulE

Sreerastoo Subhamastoo maa inTi dEvataa saubhaagyamastu
Sreerastoo Subhamastoo maa inTi dEvataa saubhaagyamastu