సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
పల్లవి:
లా లా ల ల ల లా
లా లా ల ల ల లా
అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం
పువ్వూ నవ్వూ పులకించే గాలిలో
నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం
నా చూపుకే శుభోదయం
చరణం::1
లతా లతా సరాగమాడే..సుహాసిని సుమాలతో
వయస్సుతో వసంతమాడీ..వరించెలే సరాలతో
మిలా మిలా హిమాలే..జలా జలా ముత్యాలుగా
తళా తళా గళాన..తటిల్లతా హారాలుగా
చేతులు తాకిన కొండలకే..చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో..మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచి..ఇల చేరే క్షణాలలో
అందాలలో అహో మహోదయం..భూలోకమే నవోదయం
చరణం::2
సరస్సులో శరత్తు కోసం..తపస్సులే ఫలించగా
సువర్ణిక సుగంధమేదో..మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే..మరీ మరీ నటించనా
విహారినై ఇవాళే..దివి భువి స్పృశించనా
గ్రహములు పాడిన పల్లవికే..జాబిలి ఊగెనులే
కొమ్మలు తాకిన ఆమనికే..కోయిల పుట్టెనులే
ఒక సౌఖ్యం తనువంతా..చెలరేగే క్షణాలలో
అందాలలో అహో మహోదయం..భూలోకమే నవోదయం
నీలాకాశం దిగివచ్చే లోయలో..ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే
అందాలలో అహో మహోదయం..భూలోకమే నవోదయం
JagadekaVeerudu-AtilokaSundari--1990
Music::IlayaRaja
Lyrics::Veturi
Singer's::S.P.Balu,S.Janaki
andaalalo aho mahodayam
bhoolokame navodayam
puvvu navvu pulakinche gaalilo
ningi nela chunbinche lalilo
tarallara rare viharame
andaalalo aho mahodayam
na choopuke shubhodayam
lata lata saragamade suhasini sumaalato
vayassuto vasantamadi varinchele saralato
mila mila himale jala jala mutyaaluga
tala tala galana tatillata haaraaluga
chetulu takina kondalake chalanamu vacchenule
munduku saagina muchhatalo muvvalu palikenule
oka swargam talavanchi ila chere kshanalalo
andaalalo aho mahodayam bhoolokame navodayam
puvvu navvu pulakinche gaalilo ningi nela chunbinche lalilo
tarallara rare viharame
andaalalo aho mahodayam na choopuke shubhodayam
sarassulo sharattu kosam tapassule phalinchaga
suvarnika sugandhamedo manassune harinchaga
maralinai ilaage maree maree natinchana
viharinai ivaale divi bhuvi sprushinchana
grahamulu padina pallavike jaabili oogenule
kommalu takina amanike koyila puttenule
oka soukhyam tanuvanta chelarege kshanalalo
andaalalo aho mahodayam bhoolokame navodayam
neelaakasham digivachhe loyalo oohaalokam yedurochhe haayilo
naalo sage yedo saraagame
andaalalo aho mahodayam bhoolokame navodayam
No comments:
Post a Comment