Monday, August 04, 2014

గీతాంజలి--1989




సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరి  
గానం::S.P.బాలు

పల్లవి::

ఆమని పాడవే హాయిగా..మూగవైపొకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో..పూసేటి పూల గంధాలతో 
మంచు తాకి కోయిల..మౌనమైన వేళల
ఆమని పాడవే హాయిగా..ఆమని పాడవే హాయిగా

చరణం::1

ఓ..ఆఆఆఆ..ఉల్లా ఉల్లా ఉల్లా ఉల్లా
ఉల్లా ఉల్లా ఉల్లా ఉల్లా ఉల్లా ఉల్లా ఉల్లా 
వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే..రచించెలే మరీచికా
పదాల నా ఎద..స్వరాల సంపద
తరాల నా కథ..క్షణాలదే కదా
గతించిపోవు గాధలేననీ
ఆమని పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో

చరణం::2

ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ 
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ 

సుఖాలతో పిఖాలతో..ధ్వనించినా మధూదయం
దివి భువి..కలా నిజం..స్ప్రుశించినా మహోదయం
మరో ప్రపంచమే..మరింత చేరువై
నివాళి కోరిన..ఉగాది వేళలో గతించిపోవు గాధలేననీ

ఆమని పాడవే హాయిగా

No comments: