Monday, August 04, 2014

శ్రీ కృష్ణావతారం--1967



సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల, ఘంటసాల
తారాగణం::N.T.రామారావు,శోభన్‌బాబు,ముక్కామల,సత్యనారాయణ,నాగయ్య,దేవిక,కాంచన

పల్లవి::

మెరుగు చామన ఛాయ..మేని సొంపుల వాడు 
నును మీగడల దేలు..మనసున్న చెలికాడు 
దొరవోలె నా మనసు..దోచుకున్నాడే

జగములనేలే..గోపాలుడే 
జగములనేలే..గోపాలుడే 
నా సిగలో పూవవును..ఈనాడే
మగువుల నేలే..గోపాలుడే 
నీ మనసే దోచెను..ఈనాడే 
మగువుల నేలే..గోపాలుడే 

చరణం::1

ఘుమఘుమలాడే..మమతల మల్లెలు 
ఘుమఘుమలాడే..మమతల మల్లెలు 
కోరినంతనే..దొరకవులే 
మదనుని గెలిచిన..మగరాయని గని 
మదనుని గెలిచిన..మగరాయని గని 
మల్లెలు తామే..వలచునులే
మగువా నీ మది..తెలిసెనులే 

జగములనేలే..గోపాలుడే
నీ మనసే దోచెను..ఈనాడే

చరణం::2

భామా మానస..పంజరమ్ములో 
భామా మానస..పంజరమ్ములో
రామ చిలుకవై..నిలిచేవా 
పంజరమైనా ప్రణయ..దాసునికి 
పంజరమైనా ప్రణయ..దాసునికి 
పసిడి మేడయే..ప్రియురాలా
బాసయె చేసెద..ఈ వేళా

జగములనేలే..గోపాలుడే
నీ మనసే దోచెను..ఈనాడే

చరణం::3

చేసిన బాసలు..చిగురులు వేయగ 
చేసిన బాసలు..చిగురులు వేయగ
గీసిన గీటును..దాటవుగా 
అందముతో నను..బందీ జేసిన
అందముతో నను..బందీ జేసిన
సుందరి ఆనతి..దాటేనా 
ఉందునే ఓ చెలి..నీలోనా 

జగములనేలే..గోపాలుడే 
నా సిగలో పూవవును..ఈనాడే
మగువుల నేలే..గోపాలుడే 
నీ మనసే దోచెను..ఈనాడే

No comments: