Thursday, August 09, 2012

మంత్రిగారి వియ్యంకుడు--1983





సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.జానకి
తారాగణం::చిరంజీవి,సుధాకర్,అల్లు రామలింగయ్య,పూర్ణిమా జయరాం,

తులసి,నిర్మల, రావి కొండలరావు

పల్లవి::

లలలలలలలలలా..లలలలలా
లలలాలల్లల్లాలలలలాలలలలా..ఆ

అమ్మ గదే..బుజ్జి గదే..నాపై కోపమా
దానికదే దీనికిదే..అంటే నేరమా
సారీలు చెబుతున్నా..నీ పట్టు నీదేనా
గుంజీలు తీస్తున్నా..నీ బెట్టు నీదేనా
అమ్మ గదే..బుజ్జి గదే..నాపై కోపమా
I love you..I love you
I love you..I love you

చరణం::1

ఈ పడుచు కోపాలు..తాటాకు మంట..ఆ
అవి రేపు తాపాలే..కలిపేను జంట..ఆ
మెరిసింది కొసమెరుపు..తెలిసిందిలే వలపు
రానివ్వు నా వైపు..రవ్వంత నీ చూపు
వెంటబడ్డా వేడుకున్నా
జంటరాను వెళ్ళు వెళ్ళుమంటే
ఏట్లోనొ తోట్లోనొ పడతాను చస్తానులే..ఏ
నే సచ్చి నీ ప్రేమ సాధించుకుంటానులే
అమ్మ గదే..బుజ్జి గదే..నాపై కోపమా

చరణం::2

సరసాలు విరసాలై.వచ్చింది తంటా..ఆ
రగిలింది గుండెల్లో..పొగలేని మంట..ఆ
ఈ వెక్కిరింతల్తో..వేధించి చంపొద్దు
నీ ఎత్తిపొడుపుల్తో ప్రాణాలు తియ్యొద్దు
bye bye good bye
good luck to you darling
ఇన్నాళ్ళ బంధాలు ఈనాడే తీరేనులే
కన్నీటి వీడ్కోలు కడసారి చెప్పాలిలే
అమ్మ గదే బుజ్జి గదే రావే తల్లిగా
దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా
I love you..I love you
I love you..I love you

No comments: