Monday, August 13, 2012

ఆమె ఎవరు--1966::కల్యాణి::రాగం





ఆమె ఎవరు--1966
సంగీతం::వేద
రచన::దాశరథి
గానం::P.సుశీల

రాగం::కల్యాణి


ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా
ఓ నా రాజా రావా రావా

1) నీ రూపె ఆశ రేపేను నీ మాటె వీణ మీటేను ఒ....
నీ రూపె ఆశ రేపేను నీ మాటె వీణ మీటేను
గతాలె నన్ను పిలిచాయి ఆ హాయె నేడు లేదోయి
కలగ కరిగిందంత జగమె యెంతో వింత రేయి పగలు నిన్నే వెదికేనూ
ఓ నా రాజా రావా రావా

2) వౄధాగ కాలమేగెను నిరాశె పొంగి వచ్చేను ఓ...
వౄధాగ కాలమేగెను నిరాశె పొంగి వచ్చేను
తరంగం లాగ రావోయి ప్రియా నన్నాడుకోవోయి
యేదో తీరని బాధ కన్నీరొలికే గాధ
రేయి పగలు నిన్నే వెదికేను

ఓ...నారాజా రావా రావా

3) నీ కోసం నేనే వచ్చాను నీ ఇంటికి దీపం అయినాను ఓ...
నీకోసం నేనే వచ్చను నీ ఇంటికి దీపం అయినను
నాతోనె ఆడు కోవెల ఈ కోపం నేడు నీకేలా
నీ అడుగులలో నేను నా కన్నులలో నీవు
నాలో నీవు నీలో నేనేలే.........

ఓ...నారాజా రావా రావా ఓ...నారాజా....రావా...రావా...

No comments: