Thursday, August 09, 2012

ఆదిత్య-369--199




సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P..బాలు, S.జానకి, సునంద

తా..తకతాం..తకితాం..తక తకిట దిత్తై
తకిటతై తత్ తరికిటతాం
తకతకిట తకతధిమి తకఝుణుతక 
తకిట తద్దిమిత..ధిమిత తక తకిట
  
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ..జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా
స్వరరాగ సంగమ సాధక జీవన
సురగంగ పొంగిన నర్తనశాలల 
పదములు చేరగ భంగిమలూదే
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ..జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా

ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో ఆఆఆఆఅ..ఓఓఓఓ
ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో దాచెనులే కడలి
ఆ..నటనా కిరణాల నడకలు నేర్చింది నేరిమితో నెమలి 
రాయని చదువే రసనలు దాటే రాయల సన్నిధిలో
ఆమని ఋతువే పువ్వును మీటే నాట్య కళావనిలో
నాకు వచ్చు నడకల గణితం..నాది కాక ఎవరిది నటనం
నాకు చెల్లు నవవిధ గమకం..నాకు  ఇల్లు నటనల భరతం
ఉత్తమోత్తమము వృత్తగీతముల
ఉత్తమోత్తమము వృత్తగీతముల 
మహా మహా సభాసదులు మురిసిన
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ..జనగీతము శివ పాద జాతము వచియింపగ  వశమా

స్పందించే వసంతాల తకఝణు హంపీ శిల్ప శృంగారమై
సర్వానంద రాగాల రసధును సర్వామోద సంగీతమై 
నాలో పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కల్హారమై 
నాలో ఉన్న చిన్నారి కళలివి నానా చిత్ర వర్ణాంకమై 
వన్నెలు పిలవగ..నెవ్వగ మొలవగ 
వన్నెలు పిలవగ..నెవ్వగ మొలవగ
మ మ గ గ మ ద మ..మ మ ద స ని ద మ 

రంపంప రంపపంప 
రంపంప రంపపంప రంపంప రంపపంప 
భరతము నెరుగని..నరుడట రసికుడు 
rock-u  roll-u ఆట చూడు..బ్రేకు లోని సోకు చూడు 
west side-u rhyme మీద twist చేసి పాడి చూడు 
పాత కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు 
rock rock rock n roll  shake shake shake n roll  
rock rock rock n roll  shake shake shake n roll  
రప్ప పా ప..ప పా ప..ప పా ప 
ర పా ప పా ప పా ప పా ప పా ప పా ప పా ప  
తగుదు తగుదు తగుదు తగుదు తగుదు..త త 

జనగీతము శివ పాద జాతము వచియింపగ  వశమా

No comments: