సంగీతం::ఇళయరాజా
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు,S.జానకి
పల్లవి::
లలలా లలలా లలలా లలాలా
లలలా లలలా లలలా లలాలా
ఉహూహూ అహాహహా లలలలాలల లల
కనులు కనులు..కలిసే సమయం
మనసు మనసు..చేసే స్నేహం
నీ చేరువలో నీ చేతలలో..వినిపించెను శ్రీ రాగం
కనులు కనులు..కలిసే సమయం
మనసు మనసు..చేసే స్నేహం
చరణం::1
నీ నవ్వులో విరిసె మందారము..నీ చూపులో కురిసె శృంగారము
నీ మాటలో ఉంది మమకారము..నా ప్రేమకే నీవు శ్రీకారము
పరువాలు పలికేను సంగీతము..నయనాలు పాడేను నవ గీతము
నేనే నీకు కానా ప్రాణం.. నీవే నాకు కావా లోకం
కనులు కనులు..కలిసే సమయం
మనసు మనసు..చేసే స్నేహం
చరణం::2
నీ గుండె గుడిలో కొలువుండని..నీ వెంట నీడల్లే నను సాగని
నీ పూల ఒడిలో నను చేరని..నీ నుదుట సింధురమై నిలవని
చెవిలోన గుసగుసలు వినిపించని..ఎదలోన మధురిమలు పండించని
నీలో నేనే కలగాను..రోజూ స్వర్గం చూడాలంట
కనులు కనులు..కలిసే సమయం
మనసు మనసు.. చేసే స్నేహం
నీ చేరువలో నీ చేతలలో.. వినిపించెను శ్రీ రాగం
No comments:
Post a Comment