Wednesday, August 25, 2010

చక్రధారి--1977




సంగీతం::G.K.వేంకటేష్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల

పల్లవి::

పోరా పోకిరి పిలగాడా..పోరా పోకిరి పిలగాడా
పొద్దుటి నుండి ఒకటే పోరు పోరా
పొద్దు ఎరుగనీ హద్దు ఎరుగనీ కొత్త బిక్షగాడివిరా
అరె..పోరా పోకిరి పిలగాడా...

చరణం::1

ఓ..ఓ..ఓ..ఓ..
ఇందాకనే సంతలో నన్ను చూసావూ
ఏమైదనీ ఇంతలో కన్నుగీటావు
నీకన్న చిన్నదాన్నీ చాటున్నదాన్నీ
నీలా తెగింపు నాకు రాని...
అరె..పోరా పోకిరి పిలగాడా..

చరణం::2

సందేళ్ళకూ రమ్మనీ సైగ చేసావు
పదిమందిలో జిమ్మడా పైట లాగావు
నా పైటగాలీ నీకూ..ఇస్తుంది కైపూ
నా పైటగాలీ నీకూ..ఇస్తుంది కైపూ
బుధిగ వెళ్ళి నిద్దుర పోరా...
అరె..పోరా పోకిరి పిలగాడా...

చరణం::3

ఒ..ఒ..ఒ..ఒ..ఒ..ఊ..ఊ..ఊ..
రేపల్లెలో కృష్ణుడే అనుకొన్నావా
మా పల్లెకూ రాముడే అని తలిచావా
నీకన్న పురుషులు వేరే మా ఊర లేరా
సైగలు మాని సరిగా పోరా...

అరె..పోరా పోకిరి పిలగాడా
పొద్దుటి నుంచి ఒకటే పోరు పోరా
పొద్దు ఎరుగనీ హద్దు ఎరుగనీ కొత్త బిక్షగాడివిరా
అరె..పోరా పోకిరి పిలగాడా...

No comments: