Tuesday, August 31, 2010

సీతారామ కల్యాణం--1961::తిలక్‌కామోద్::రాగం



సంగీతం::గాలిపెంచెల నరసింహారావు
రచన::సముద్రాల రాఘవాచార్య 
గానం::P. సుశీల
తారాగణం::N.T. రామారావు,B.సరోజాదేవి,గుమ్మడి,నాగయ్య,కాంతారావు,గీతాంజలి,హరనాధ్
తిలక్‌కామోద్::రాగం 

పల్లవి::

వీణా..ఆఆఆఆ..పాడవే..ఏఏఏ..రాగమయీ 
పాడవే  రాగమయీ వీణా 
పాడవే..రాగమయీ 
లంకానాధుని..రమణీయగాధ    
లంకానాధుని..రమణీయగాధ 

పాడవే..రాగమయీ 

చరణం::1

రాగములో..అనురాగము కలిపి 
రాగములో..అనురాగము కలిపి

శివ యోగములో భోగము తెలిపి 
జగమే ప్రేమకు నెలవును చేసే 
జగమే ప్రేమకు..నెలవును చేసే
రసికావతంసుని..రమణీయ గాధ 

పాడవే..రాగమయీ

చరణం::2

వీణా మాధురి..శివుమురిపించి   
వీణా మాధురి..శివుమురిపించి        
విక్రమ ధాటిని..అమరులనుంచి 
కనుల సైగల..నా మనసేలే              
కనుల సైగల..నా మనసేలే
కైకసి సూనుని కమనీయ గాధ 

పాడవే రాగమయీ 
వీణా పాడవే రాగమయీ 
రాగమయీ..ఈఈఈఈ..రాగమయీ..ఈఈఈ

No comments: