Wednesday, August 17, 2011

యువరాజు--1982



















సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

నీలాల నింగి..ఒకసారి వంగి
నీలాల నింగి..ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి..ముద్దాడిపోతే
అదే అచ్చట..అదే ముచ్చట
అదే ముచ్చట..అదే అచ్చట..ఈ జన్మకంతా

నీలాల నింగి..ఒకసారి వంగి
నీలాల నింగి..ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి..ముద్దాడిపోతే
అదే అచ్చట..అదే ముచ్చట
అదే ముచ్చట..అదే అచ్చట..ఈ జన్మకంతా

చరణం::1

పయనించు మేఘాలు..పయనాలు ఆపి
చిరునవ్వు నవ్వి..చిరుజల్లు చల్లి
కదలి వెడలి పోతే..అదే ముచ్చట

సెలయేటి పరవళ్ళు..కాసేపు ఆగి
సెలయేటి పరవళ్ళు..కాసేపు ఆగి
సిగ్గుల్లో నిన్ను..మైకంలో నన్ను
చూసి చూడలేక..ఉండీ ఉండలేక
కదలి వెడలిపోతే..అదే ముచ్చట..అదే అచ్చట
అదే ముచ్చట..అదే అచ్చట..ఈ జన్మకంతా

ఆ ఆ..నీలాల నింగి..ఒకసారి వంగి
నీలాల నింగి..ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి..ముద్దాడిపోతే
అదే అచ్చట..అదే ముచ్చట
అదే ముచ్చట..అదే అచ్చట..ఈ జన్మకంతా

చరణం::2

నిదురించు అందాలు..ఒకసారి లేచి
పైపైకి వచ్చి..పరువాలు చూసి
నిదుర మరచి పోతే..అదే ముచ్చట

లోలోని కోరికలు..లోకాలు మరిచి
లోలోని కోరికలు..లోకాలు మరిచి
కళ్ళల్లో నిన్ను..కౌగిళ్ళో నన్ను
ఉంచీ ఉంచలేక..వదలీ వదలలేక
కదలి వెడలిపోతే..అదే ముచ్చట..అదే అచ్చట
అదే ముచ్చట..అదే అచ్చట..ఈ జన్మకంతా

ఆ ఆ..నీలాల నింగి..ఒకసారి వంగి
నీలాల నింగి..ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి..ముద్దాడిపోతే
అదే అచ్చట..అదే ముచ్చట
అదే ముచ్చట..అదే అచ్చట..ఈ జన్మకంతా

No comments: