Wednesday, August 17, 2011

యువరాజు--1982

సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి
గానం::S.P.బాలు

పల్లవి::

నారినారి నడుమ మురారి..నీది నాది వేరే దారి
నారినారి నడుమ మురారి..నీది నాది వేరే దారి
అటు చూస్తే గోదారి..ఇటు చూస్తే కావేరి
నడిమధ్య ఉన్నాను..హరి..హరి..హరి
నారినారి నడుమ మురారి..నీది నాది వేరే దారి 

చరణం::1

హా..తాగానని తప్ప తాగానని..చేస్తానని తప్పు చేస్తానని
అనుకోమాకు కలగనమాకు..గోదారి
వేశానని పందెం వేశానని..పోతానని ఓడిపోతానని
అనుకోమాకు కలగనమాకు..కావేరి

తాగి..తాగి తాగి..ఊగి..ఊగి..ఊగి
అడుగు తప్పక..పదము తప్పక
ఆడిపాడి నిలిచేవాడే..మగాడు

నారినారి నడుమ మురారి..నీది నాది వేరే దారి
అటు చూస్తే గోదారి..ఇటు చూస్తే కావేరి
నడిమధ్య ఉన్నాను..హరి..హరి..హరి
నారినారి నడుమ మురారి..నీది నాది వేరే దారి   

చరణం::2

ఆగానని ఆగి తాగానని..తింటానని దెబ్బ తింటానని
అనుకోమాకు కలగనమాకు..గోదారి
చూశానని అందం చూశానని..పోయానని పడిపోయానని
అనుకోమాకు కలగనమాకు..కావేరి

ఆడి..ఆడి..పాడి..ఆడి..పాడి..ఆడి
గెలుపు పొందగ..పిలుపు అందగ
నిన్ను ఓడి గెలిచేవాడే..మగాడు

నారినారి నడుమ మురారి..నీది నాది వేరే దారి
నారినారి నడుమ మురారి..నీది నాది వేరే దారి
అటు చూస్తే గోదారి..ఇటు చూస్తే కావేరి
నడిమధ్య ఉన్నాను..హరి..హరి..హరి
నారినారి నడుమ మురారి..నీది నాది వేరే దారి    

No comments: