Friday, August 20, 2010

భాగ్య చక్రం--1968


సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు 
రచన::పింగళి
గానం::ఘంటసాల
Film Directed By::Kadiri Venkata Reddy
తారాగణం: N.T. రామారావు, B. సరోజాదేవి, రాజనాల, గీతాంజలి, పద్మనాభం, ముక్కామల

పల్లవి::

కుండ కాదు కుండకాదు..చినదానా
నా గుండెలదరగొట్టినావే..చినదానా
కుండ కాదు కుండకాదు..చినదానా
నా గుండెలదరగొట్టినావే..చినదానా

చరణం::1

పరుగిడితే అందాలన్నీ..ఒలికిపోయెనే
తిరిగిచూడ కన్నులలోనా..మెరుపు మెరిసినే
ఒలికిన అందాలతో..మెరిసిన నీ చూపులతో
ఎంత కలచినావో నన్నూ ఎరుగవైతివి

ఓహో హో హో..కుండ కాదు కుండ కాదు చినదానా
నా గుండెలదరగొట్టినావే..చినదానా

చరణం::2

మొదటి చూపులోనే మనసు.. దోచికొంటివే
ఎదుటపడిన నీ వలపు..దాచుకొంటివే
దోచుకున్న నా మనసు..దాచుకున్న నీ వలపు
అల్లిబిల్లి అయినాగానీ..తెలియవైతివే

ఓహో హో హో..కుండ కాదు కుండ కాదు చినదానా
నా గుండెలదరగొట్టినావే..చినదానా


చరణం::3

నన్ను చూచు కోరికతోనే..వచ్చినావుగా
నిన్ను చూచు ఆశతోనే..వేచినానుగా
వచ్చినట్టే నీ నెపము..వేచినట్టే నాతపము
ఫలము నిలుపుకొందమన్నా..నిలువవైతివే

ఓహో హో హో..కుండ కాదు కుండ కాదు..చినదానా
నా గుండెలదరగొట్టినావే..చినదానా

No comments: