సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::D.సినారె
గానం::S.P.బాలు,P.సుశీల
పల్లవి::
నీవు బొమ్మవా..ఉహూ
ముద్దు గుమ్మవా..ఊహూ హు హు
మనసు దోచే మరుమల్లె కొమ్మవా..అహా..అహా..ఆ..అహహాహా
పలుకవా ప్రియా ప్రియా..తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం..మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం నేనో సగం..ఒకటే జీవితం..
పలుకవా ప్రియా ప్రియా..తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం..మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం నేనో సగం..ఒకటే జీవితం
పలుకవా ప్రియా ప్రియా..తెలుపవా ప్రియా ప్రియా
చరణం::1
నీవెవరో ఊర్వశివి..మురిపించే ప్రేయసివి
తలపులలో మెరిశావు..నా మదిలో వెలిశావు
సన్నిధిలో సరాగాలు..పెన్నిధిగా ప్రసాదించు

ఆశా రధం..సాగే రిథం నీవే తెలుపవా
పలుకవా ప్రియా ప్రియా..తెలుపవా ప్రియా ప్రియా
చరణం::2
కదలని నీ కన్నులలో కళలెన్నో కన్నాను
ముసిముసి నీ నవ్వులలో గుసగుసలే విన్నాను
పచ్చని కల ఫలించాలి..వెచ్చని జత సుఖించాలి

మన ఈ కథ..మమతల సుధా..చెలిమే సంపదా
పలుకవా ప్రియా ప్రియా..తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం..మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం..నీవో సగం..ఒకటే జీవితం
పలుకవా ప్రియా ప్రియా..తెలుపవా ప్రియా ప్రియా
పలుకవా ప్రియా ప్రియా..తెలుపవా ప్రియా ప్రియా
లలలాలల లలాలలాలాల్లా
No comments:
Post a Comment