Friday, August 20, 2010

నాయకుడు--1987




సంగీతం::ఇళయరాజ
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ
హోయ్..పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ..ఆ..ఆ

చరణం::1

నీవు నడిచే బాటలోనా లేవు బాధలే..తనక్కుధిన్
నేను నడిచే బాట మీకూ పూల పాన్పులే..తనక్కుధిన్
ఒకటంటా ఇక మనమంతా..లేదంటా చీకూచింతా 
సాధించాం ఒక రాజ్యాంగం..సాగిస్తాం అది మనకోసం
వీసమైన లేదులే..బేధ భావమే 
నీకు నాకు ఎన్నడూ..నీతి ప్రాణమే
తాం తదిద్ధీం ధీం తధిత్తాం ఆడి పాడుదాం

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ
పలికెను రాగం సరికొత్త గానం
నీ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం

చరణం::2

పాలుతేనెల్లాగ మంచిని పంచు సోదరా..తనక్కుధిన్
ఆదరించే దైవముంది కళ్ళముందరా..తనక్కుధిన్
పూవులతో నువు పూజించు కర్పూరాన్ని వెలిగించూ
మమకారాన్ని పండించూ అందరికీ అది అందినూ 
వాడలోన వేడుకే తుళ్ళి ఆడెనూ
అంతులేని శోభలే చిందులేసెనూ
తాం తదిద్ధీం ధీం తధిత్తాం ఆడి పాడుతాం

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ 
పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ

No comments: