సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::S.P.బాలు,చిత్ర
తారాగణం::నాగార్జున,శ్రీదేవి, సుహాసిని
పల్లవి::
ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లొ
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో
ఇప్పటికిప్పుడు శిస్తుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో చిక్కిన చెక్కిలిలో
నీ వంపుల సొంపే నా వంటికి పంపే
అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో
ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లొ
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో..
ఇప్పటికిప్పుడు శిస్తుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో చిక్కిన చెక్కిలిలో
చరణం::1
ఒక మాటు ఒడిని మీటి
ఒక మాటు ఒడిని మీటి
వలపు రాగాలు దాచేసుకుంటాలే
పొద చాటు కధలు దాటి
పొద చాటు కధలు దాటి
చిలిపి గారాలు పోగేసుకుంటాలే
ఎప్పటికప్పుడు దప్పిక తీరని కమ్మని దాహాలే
ఏమని చెప్పను నీకు జవాబులు పైటల పాప
అచ్చట ముచ్చట ఇప్పటికిప్పుడు పెంచిన మోహాలే
ఎంతని ఆపను నిన్ను మరీ మది బిత్తరపోక
చక్కని చుక్క తన సొంతం అనుకోమాక బలవంతపు
కోరికలే ఓపికలై మోజులు తెచ్చిన అమ్మడిలో
ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లొ
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో
ఇప్పటికిప్పుడు శిస్తుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో చిక్కిన చెక్కిలిలో
నీ వంపుల సొంపే నా వంటికి పంపే
అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో
ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లొ
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో
చరణం::2
హ్హా..ఆహ్హా..హ్హా..ఆహ్హా..హేయ్..ఏహేయ్..
హ్హా హ్హా హ్హా ఏహేయ్..
పొరపాటో తెరకు చాటో
పొరపాటో తెరకు చాటో
వయసు ఆటాడుకోవాలి ఈనాడే
అది ఆటో పెదవి గాటో
అది ఆటో పెదవి గాటో
మధుర గాయాలు నాటాలి లోలోనే
చప్పున ఆరని నిప్పుల కుంపటి రేపిన పాపాలే
చల్లని వెన్నెల చిచ్చుల ఉచ్చులు వేసెను నాకే
అచ్చిక మచ్చిక పిచ్చిక బుచ్చిక చేసిన అందాలే
జంటగ గుట్టల రెప్పల గంటలు కొట్టెను నేడే
చమ్మని చక్కే మన ఆట మల్లెల పక్కే మన తోట
నవ్వులతో పువ్వులతో కింకలు పెట్టిన ప్రేమలలో
ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లొ
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో
ఇప్పటికిప్పుడు శిస్తుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో చిక్కిన చెక్కిలిలో
నీ వంపుల సొంపే నా వంటికి పంపే
అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో
ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లొ
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో
ఇప్పటికిప్పుడు శిస్తుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో చిక్కిన చెక్కిలిలో
No comments:
Post a Comment