సంగీతం::పెండ్యాల
రచన::సినారె
గానం::S.P.బాలు,ఆనంద్ & కోరస్
Film Directed By::N.T.Raamaa Rao
తారాగణం::N.T.రామారావు,హరికృష్ణ,N.బాలకృష్ణ,నందమూరి హరికృష్ణ,గుమ్మడి,
ముక్కామల,కైకాల సత్యనారాయణ,ధుళిపాళ,M.ప్రభాకర్‌రెడ్డి,మిక్కిలినేని రాధాకృష్ణ,కాంచన,S.వరలక్ష్మిB.సరోజినీదేవి,శారద,ప్రభ.
పల్లవి::
జయీభవ..ఆఆ..విజయీభవ
జయీభవ..ఆఅ..విజయీభవ
చంద్రవంశ పాదోది చంద్రమా..ఆ
కురుకుల సరసీ రాజహంసమా..ఆ
జయీభవ..ఆఆ..విజయీభవ
చరణం::1
ధన్య గాంధారి గర్భశుక్తి
ముక్తాఫలా....
మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన
తేజఃఫలా..ఆ ఆ ఆ
ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా
మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా
దిగ్గజ కుంభవిదారణచణ శతసోదరగణ పరివేష్టితా
చతుర్ధశ భువన చమూనిర్ధళణ చటుల భుజార్గళ శోభితా
జయీభవ..విజయీభవ..ఆఆఆ..
చరణం::2
కవిగాయక నట..వైతాళిక
సంస్తూయమాన..విభవాభరణా
నిఖిల..రాజన్యమకుటమణి
ఘ్రుణీ నీరాజిత..మంగళచరణా
మేరు శిఖరి..శిఖరాయమాన
గంభీర..భీగుణ..మానధనా
క్షీరపయోధి..తరంగ..విమల
విస్పార..యశోధన..సుయోధనా
జగనొబ్బ..గండ...జయహో
గండర గండ.....జయహో
అహిరాజకేతనా....జయహో
ఆశ్రిత పోషణ.....జయహో
జయహో.......జయహో
జయహో.......జయహో
No comments:
Post a Comment