Saturday, March 15, 2014

బొమ్మరిల్లు--1978




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, P.సుశీల

పల్లవి:

ఏయ్ పిల్లా...
ఏయ్ పిల్ల..చూడు మల్లా
ఆడుకుంటే..తొక్కుడు బిల్లా

ఏయ్ పిల్ల..చూడు మల్లా
ఆడుకుంటే..తొక్కుడు బిల్లా
ఎట్టాగుంటాదో..
చెంపలోని..కెంపులన్ని..
దోచుకుంటే..చెక్కిలి గుంట..ఏమయ్ పోతుందో..హోయ్

ఏయ్ పిల్లాడా
ఔ మల్ల..అల్లరోడా
అంటుంకుంటే..అగ్గిపుల్లా

ఔ మల్ల..అల్లరోడా
అంటుంకుంటే..అగ్గిపుల్లా
ఏమయ్ పోతుందో
ఉట్టిమీద పాలపట్టి..పట్టబోయి
జారిబడితి..ఎట్టాగుంటాదో..హోయ్

ఏయ్ పిల్ల..చూడు మల్లా..ఔ మల్లా

చరణం::1

సందెకాడ..అహా
నేను వస్తే..అహా
సన్నజాజి పువ్వులు ఇస్తే
పెట్టుకుంటావా..తల్లో పెట్టమంటావా

పువ్వులిస్తే..అహా
పుచ్చుకుంటా..ఒహో
పక్కకొస్తే..వళ్లు మంటా
ఇచ్చుకుంటావా..రెండు ఇవ్వమంటావా

యాదగిరి గుట్ట కాడ ఎన్నెలొచ్చింది
గోదారి గట్టు మీద కన్ను కొట్టింది
జింగిరాల గిత్త పొగరు రంకె వేసింది
బొంగరాల ఈడు కాడ కంకి వేసింది

బా..బా..బాబ..బంతులిస్తావా
ము..ము..ము..ముద్దబంతులిస్తావా
ఛీ..ఛీ..ఛీ..చి..చిట్టిపాపాయి
ఫో..ఫో..ఫో..పొట్టిపోయింది
ఏయ్ పిల్ల..చూడు మల్లా..ఔ మల్లా

చరణం::2

ఏటి కాడ..అహా
నీటి కొస్తే..అహా
నీటి కడవ ఎత్తమంటే
ఎత్తి పెడతావా 
నన్నే ఎత్తుకెళ్తావా

కడవలాగ..అహా
ఎత్తుకుంటా..అహా
కౌగిలించి హత్తుకుంటా
ఒప్పుకుంటావా
వద్దు తప్పు అంటావా

నీలగిరి కొండ మీద ఎండ కాసింది
చంద్రగిరి కోనలోన చలి వేసింది
ఆడపిట్ట కూత కొచ్చి పాట పాడింది
పట్టబోతే పడుచుతనం పైటలేసింది

అరెరే..ఛీ..ఛీ..ఛీ..చిట్టిపాపాయి
ఫో..ఫో..ఫో..పొట్టిపోయింది
బా..బా..బా..బంతులిస్తావా
ము..ము..ము..ముద్దబంతులిస్తావా

ఏయ్ పిల్లాడా
ఏయ్ పిల్ల..చూడు మల్లా
ఆడుకుంటే..తొక్కుడు బిల్లా
ఎట్టాగుంటాదో
చెంపలోని..కెంపులన్ని
దోచుకుంటే..చెక్కిలి గుంట..ఏమయ్ పోతుందో

ఔ మల్ల..అల్లరోడా
అంటుంకుంటే..అగ్గిపుల్లా
ఏమయ్ పోతుందో
ఉట్టిమీద పాలపట్టి..పట్టబోయి
జారిబడితి..ఎట్టాగుంటాదో

No comments: