Saturday, March 15, 2014

శుభలేఖ--1982






















సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి 
గానం::S.P.బాలసుబ్రమణ్యం, S.P.శైలజ 

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ల ల ల ల ల..ఐతే
అది నిజమైతే..అదే నిజమైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే

చరణం::1

నిగిలోని చంద్రుడికి..నీటిలోని కలువకి
దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
ఆ..నిగిలోని చంద్రుడికి..నీటిలోని కలువకి
దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
చందమామ అవునంటే వెన్నెలగా
కలువ భామ అది వింతే పున్నమిగా
ఆ..చందమామ అవునంటే వెన్నెలగా
కలువ భామ అది వింటే పున్నమిగా

నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి 
తలంబ్రాలుగా కురిసే వేళా..చేరువైతే
ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ల ల ల ల ల..ఐతే..
అది నిజమైతే..అదే నిజమైతే

చరణం::2

రెమ్మ చాటు రాచిలక..కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
రెమ్మ చాటు రాచిలక..కొమ్మ దాటి గోరింక 
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతీ నక్షత్రం
తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
ఆ..ఆకసాన అరుధంతీ నక్షత్రం
తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
మనసిచ్చిన మలిసంధ్యలు కుంకుమలై కురిసీ 
నుదుట తిలకమై మెరిసే వేళా..చేరువైతే

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ల ల ల ల ల ఐతే
అది నిజమైతే..అదే నిజమైతే

Subhalekha--1982
Music::K.V.Mahadevan
Lyric::Veturi Sundararamamurthy 
Singer's::S.P.Balasubrahmanyam,S.P.Sailaja

:::

aite..adi nijamaite..ade nijamaite
la la la la la..aite
adi nijamaite..ade nijamaite
ee guvvaki aa guvve todaite
adi puvvula navvula punnami vennela goodaite
ee guvvaki aa guvve todaite
adi puvvula navvula punnami vennela goodaite

aite..adi nijamaite..ade nijamaite

:::1

nigiloni chandrudiki..neetiloni kaluvaki
doorabhaaramentainaa raayabaari nenunnaa
aa..nigiloni chandrudiki..neetiloni kaluvaki
doorabhaaramentainaa raayabaari nenunnaa
chandamaama avunante vennelagaa
kaluva bhaama adi vinte punnamigaa
aa..chandamaama avunante vennelagaa
kaluva bhaama adi vinte punnamigaa

naa aasalu egasi egasi taaralato kalisi 
talambraalugaa kurise velaa..cheruvaite
aite..adi nijamaite..ade nijamaite
la la la la la..aite..
adi nijamaite..ade nijamaite

:::2

remma chaatu raachilaka..komma daati gorinka
choopulatone raayani Subhalekhalu raastunte
remma chaatu raachilaka..komma daati gorinka 
choopulatone raayani Subhalekhalu raastunte
aakasaana arudhantee nakshatram
telipindee idenanee sumuhoortam
aa..aakasaana arudhantee nakshatram
telipindee idenanee sumuhoortam
manasichchina malisandhyalu kunkumalai kurisee 
nuduTa tilakamai merise veLaa..cheruvaite

aite..adi nijamaite..ade nijamaite
la la la la la aite

adi nijamaite..ade nijamaite


No comments: