Sunday, March 16, 2014

ఇల్లాలు--1965

















సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P. సుశీల

పల్లవి::

మల్లె పూవులు విరిసెరా..మంచు తెరలు కరిగెరా
నల్లనయ్యా మేలుకో..ఓ ఓ ఓ..చల్లనయ్యా మేలుకో

చరణం::1

పురిటి వెలుగున బుగ్గపై..నీ పంటి నొక్కులు కంటిరా 
చిరుత నవ్వుల పెదవిపై..చిరుత నవ్వుల పెదవిపై 
నా కంటి కాటుక నంటెరా

నల్లనయ్యా మేలుకో..చల్లనయ్యా మేలుకో
చిక్కుపడిన కురులు చూసి 
సిగ్గు ముంచుకొ వచ్చెరా
రేయి గడిచిన హాయినంత
రేయి గడిచిన హాయినంత
మనసు నెమరు వేసేరా..
నల్లనయ్యా మేలుకో..చల్లనయ్యా మేలుకో

చరణం::2

నీవు నిండుగ నవ్వినపుడే..నాకు నిజముగ తెల్లవారును 
నా కాపురానా రేపు మాపులు..కాపురానా రేపు మాపులు 
కలవురా నీ చూపులోనే

మల్లె పూవులు విరిసెరా..మంచు తెరలు కరిగెరా
నల్లనయ్యా మేలుకో..చల్లనయ్యా మేలుకో

మల్లె పూవులు విరిసెరా..మంచు తెరలు కరిగెరా

No comments: