Friday, March 30, 2012
లక్షాధికారి--1963
సంగీతం::టి.చలపతిరావు
రచన::కొసరాజు
గానం::మాధవపెద్ది సత్యం
పల్లవి::
ఓహో అందమైన చిన్నదాన
బంగారు వన్నెదాన
ఓహో నీలిరంగు చీరదాన
భలే నెరజాణ
నా మీద కోపమా...
ఇటు చూడు ఒక్కసారి
హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ...
చరణం::1
కులాసా నవ్వుల చిలకగదే
నీ రుసలు బుసలు ఇక మానగదే
కులాసా నవ్వుల చిలకగదే
నీ రుసలు బుసలు ఇక మానగదే
తుపానుగా లేచి తమాషాగా చూచి
నా మనసును దోచి వేశావులే పేచీ
నా మీద కోపమా...
ఇటు చూడు ఒక్కసారి
హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ...
చరణం::2
వయ్యారము నీలో ఉన్నదిలే
గయ్యాళి పోజులో ఎందుకులే
వయ్యారము నీలో ఉన్నదిలే
గయ్యాళి పోజులో ఎందుకులే
నీ పోకిరి కళ్లు ఆ కళ్లల్లో థ్రిల్లు
ఎవ్వానికి దక్కు అవ్వానిదే లక్కు
కాదేమో చెప్పుమా...
ఇటు చూడు ఒక్కసారి
హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ...
చరణం::3
తరింతును లేవే నిను వలచి
సుఖింతు హాయిగా నినుదలచి
తరింతును లేవే నిను వలచి
సుఖింతు హాయిగా నినుదలచి
నిన్నే కలగంట నువ్వే నా జంట
నీవెంట పడి వస్తా కాదంటే పడి చస్తా
ఇంకేల కోపము...
ఇటు చూడు ఒక్కసారి
హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment