Friday, March 21, 2014

ప్రేమలేఖలు--1977


















సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::మరళీమోహన్,అనంతనాగ్,సత్యనారాయణ,జగ్గయ్య,జయసుధ,దీప,
అల్లు రామలింగయ్య

పల్లవి::

నీ అందం..నీ పరువం
నీ అందం నీ పరువం..నాలో దాచుకో
కాలం తెలియని బిగి కౌగిలిలో..నన్నే దాచుకో

ఈ అందం ఈ పరువం..నీకే అంకితం
రేయి పగలు వెన్నెల కాదా..నీతో జీవితం..మ్మ్

చరణం::1

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..మ్మ్ హా హా
ఆ ఆ ఆ హహహా ఆ..

వీచే గాలి పూచే పూలు..గుసగుసలాడాయి
కోరికలన్నీ తీరేదెపుడని..రెపరెపలాడాయి 
వీచే గాలి పూచే పూలు..గుసగుసలాడాయి
కోరికలన్నీ తీరేదెపుడని..రెపరెపలాడాయి
ఆ తొందర చూసి ఎగిరే గువ్వలు కిలకిల నవ్వాయి 

నీ అందం నీ పరువం..నాలో దాచుకో
రేయి పగలు వెన్నెల కాదా..నీతో జీవితం

చరణం::2

వలచిన నింగి ప్రేయసి కోసం..వానై కురిసిందీ
ఆ వానకు తడిసిన భూమి గుండెలో..ఆవిరి ఎగిసిందీ 
వలచిన నింగి ప్రేయసి కోసం..వానై కురిసిందీ
ఆ వానకు తడిసిన భూమి గుండెలో..ఆవిరి ఎగిసిందీ 
ఆ కలియికలోనే నింగి నేల..జతగా మురిసేదీ 

నీ అందం..మ్మ్..నీ పరువం..ఆహా..నాలో దాచుకో
కాలం తెలియని బిగి కౌగిలిలో..నన్నే దాచుకో..హ్హా

ఈ అందం ఈ పరువం..నీకే అంకితం
రేయి పగలు వెన్నెల కాదా..నీతో జీవితం
ఆ ఆ ఆ ఆ ఆ ఆహా ఆహా..

No comments: