Friday, March 21, 2014

దేవాంతకుడు--1960




















సంగీతం::అశ్వత్థామ
రచన::ఆరుద్ర
గానం::P. B. శ్రీనివాస్, జానకి
తారాగణం::N.T రామారావు, కృష్ణకుమారి, S.V. రంగారావు,K. రఘురామయ్య

పల్లవి::

జగమంతా మారినది జవరాలా నీ..వలన
జగమంతా మారినది జవరాలా నీవలన

జన్మమే తరించినది జతగాడా నీ..వలన
జన్మమే తరించినది జతగాడా నీవలన
జన్మమే తరించినది

చరణం::1

అణువు అణువునా అందమే తొణికిస లాడినదీ..తొణికిస లాడినది
అణువు అణువునా అందమే తొణికిస లాడినదీ..తొణికిస లాడినది
కనులముందు స్వర్గమే..కనులముందు స్వర్గమే 
గజ్జెకట్టి ఆడినది..గజ్జెకట్టి ఆడినది
జగమంతా మారినది జవరాలా నీ..వలన

చరణం::2

దివి నుండి దేవతలే దిగివచ్చి దీవించిరి
దివి నుండి దేవతలే దిగివచ్చి దీవించిరి
తీయని హాయిలో మనసు
తీయని హాయిలో మనసు తేలి తేలి సోలినది..తేలి తేలి సోలినది
జన్మమే తరించినది జతగాడా నీ..వలన

చరణం::3

రెక్కవిప్పి హృదయాలే ఎక్కడికో ఎగిరినవి
రెక్కవిప్పి హృదయాలే ఎక్కడికో ఎగిరినవి
చక్కని లోకాలు జయించి
చక్కని లోకాలు జయించి సామ్రాజ్య లేలినవి..సామ్రాజ్య లేలినవి
జగమంతా మారినది..నిజమైన ప్రేమ వలన..జగమంతా మారినది

No comments: