Monday, March 21, 2011

బావమరదళ్ళు--1961

















సంగీతం::పెండ్యాల
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం::రమణమూర్తి,కృష్ణకుమారి, C S. R. ఆంజనేయులు, పెరుమాళ్ళు,బాలకృష్ణ

పల్లవి::

హృదయమా..ఆ..ఓ..బేల హృదయమా
ఒకేసారిగ నీకింత సంతోషమా..హృదయమా..ఆ..ఆ

చరణం::1

తీయని ఊహాలు హాయిగ నీలో మరల చిగిర్చె సుమా 
ఆ..ఆ..మరల చిగిర్చె సుమా 
పూచిన పూవులు నోచిన నోములు కాచి ఫలించు సుమా 
ఆ..ఆ..అవి కాచి ఫలించు సుమా..ఆ

హృదయమా..ఆ..ఓ..బేల హృదయమా
మనసు తెలుపుగా నీకింత మొమోటమా..ఆ
హృదయమా..ఆ

చరణం::2

తీగెలు సడలిన సితార తాను తిరిగి మ్రోగె సుమా 
ఆ..ఆ..తిరిగి మ్రోగె సుమా 
మ్రోగిన పాటే మోహానమై అనురాగము నించె సుమా 
ఆ..ఆ..అనురాగము నించె సుమా 

హృదయమా..ఆ..ఓ..బేల హృదయమా
ఒకేసారిగ నీకింత సంతోషమా..ఆ
హృదయమా..ఆ

చరణం::3

అందారాని ఆ చందమామ నీ చెతికి అందె సుమా
ఆ..ఆ..చెతికి అందె సుమా
చందమామ నీ చేతులలోనే బంధీ అగును సుమా
ఆ..ఆ..ఇక బంధీ  అగును సుమా

హృదయమా..ఆ..ఓ..బేల హృదయమా
మనసు తెలుపుగా నీకింత మొమోటమా..ఆ
హృదయమా..ఆ..ఆ

No comments: