Monday, March 17, 2014

బుద్ధిమంతుడు--1969
























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని, విజయనిర్మల, శోభన్‌బాబు,నాగభూషణం,అల్లు రామలింగయ్య

పల్లవి::

గుట్టమీద గువ్వ కూసింది 
కట్టమీద కంజు పలికింది 
ఓ..గుట్టమీద గువ్వ కూసింది 
కట్టమీద కంజు పలికింది 
ఓ..గుడిలోన జేగంట మ్రోగింది 
నా గుండెలో తొలివలపు పండింది 
ఓ..గుడిలోన జేగంట మ్రోగింది 
నా గుండెలో తొలివలపు పండింది 
ఓ గుండెలో తొలివలపు పండింది 

చరణం::1

నల్లా నల్లాని మబ్బు నడిచింది 
తెల్లా తెల్లాని అంచు తోచింది 
నల్లా నల్లాని మబ్బు నడిచింది 
తెల్లా తెల్లాని అంచు తోచింది 
తనువు సెలరేఖలై వెలిగింది 
తనువు సెలరేఖలై వెలిగింది 
చల్లా చల్లాని జల్లు కురిసింది 
ఓ..గుట్టమీద గువ్వ కూసింది 
నా గుండెలో తొలివలపు పండింది 
ఓ..గుట్టమీద గువ్వ కూసింది 

చరణం::2

కొమ్మ మీదా వాలి గోరింకా 
కమ్మ కమ్మని ఊసులాడింది 
మ్మ మీదా వాలి గోరింకా 
కమ్మ కమ్మని ఊసులాడింది
గోరింక తానింక గూడు కట్టకపోతే 
గోరింక తానింక గూడు కట్టకపోతే 
కొమ్మా యెంతో చిన్న బోతుంది 
కొమ్మా యెంతో చిన్న బోతుంది 
ఓ..గుట్టమీద గువ్వ కూసింది 
నా గుండెలో తొలివలపు పండింది 
ఓ..గుట్టమీద గువ్వ కూసింది 

చరణం::3

సన్న గాజుల రవళి పిలిచింది 
సన్న జాజుల దండ వేసింది 
సన్న గాజుల రవళి పిలిచింది 
సన్న జాజుల దండ వేసింది 
మనసైన జవరాలే వలచింది 
మనసైన జవరాలే వలచింది 
మనుగడే ఒక మలుపు తిరిగింది 
మనుగడే ఒక మలుపు తిరిగింది 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

No comments: