Thursday, March 18, 2010

బుద్ధిమంతుడు--1969























సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర 
గానం::ఘంటసాల

పల్లవి::

జై శ్రీమద్రమారమణ గోవిందో హా..నాయనలారా
బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ
భక్తి ముక్తి కావాలంటే మాధవ సేవా చెయ్యాలంటే
బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ

గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ
భుక్తి శక్తి కావాలంటే..మానవ సేవా చెయ్యాలంటే
గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ
భక్తి ముక్తి కావాలంటే మాధవ సేవా చెయ్యాలంటే

బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ

చరణం::1

దేవుడి పేరిట దోపిడి చేసే దళారులెందరొ పెరిగారు
ముక్తి మత్తులో భక్తుల ముంచి సర్వం భొంచేస్తున్నారు
నోరులేని ఆ దేవుడు పాపం నీరు గారి పోతున్నాడు..అయ్యో
ఓ ఓ ఓ ఓ ఓ ఓ హేయ్ ....

గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ
గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ


చదువుల పేరిట గుమాస్తాలను తయారు చేస్తూ ఉన్నారు
ప్రభువుల్లాగ బ్రతికేవాళ్ళను బానిసలుగ చేస్తున్నారు
ఉద్యోగాలకు వేటలాడమని ఊళ్ళపైకి తోలేస్తున్నారు 
బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ

చరణం::2

చదవకపోతే మనిషి రివ్వున చంద్రుడి పైకి ఎగిరేవాడా
గిర గిర తిరిగి వచ్చేవాడా
దేవుడు చల్లగ చూడకపోతే అక్కడ గల్లంతైపోడా
ఆనవాలు చిక్కేవాడా

బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ
గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ

చరణం::3

చదువులుసారం హరి యని..హరి కూడా చదవాలని
చదువుల మర్మం హరి యని..ఆ హరి కీ గురువుండాలని
హరియే సర్వశమని..చదువే సర్వశమని
హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్ల గుద్ది చెప్పాడు

ఆ హరియే శ్రీకృష్ణుడుగా వచ్చి బడిలో కూర్చొని చదివాడు
ఈ బడిలో కూర్చొని చదివాడు చదివాడు చదివాడు చదివాడు
చదివాడు చదివాడు

Buddhimantudu--1969
Music::K.V.Mahaadevan
Lyrics::Arudra
Singer's::Ghantasala

:::

jai SreemadramaaramaNa gOvindO haa..naayanalaaraa
baDilO aemundee devuni guDilOne undee
bhakti mukti kaavaalanTe maadhava sevaa cheyyaalanTe
baDilO emundee devuni guDilOne undee

guDilO emundee baaboo baDilOne undee
bhukti Sakti kaavaalanTe..maanava sevaa cheyyaalanTe
guDilO emundee baaboo baDilOne undee

:::1

devuDi periTa dOpiDi chese daLaarulendaro perigaaru
mukti mattulO bhaktula munchi sarvam bhonchestunnaaru
nOruleni aa devuDu paapam neeru gaari pOtunnaaDu..ayyO
O O O O O O ..hEy
guDilO emundee baaboo baDilOne undee
guDilO emundee baaboo baDilOne undee


chaduvula periTa gumaastaalanu tayaaru chestoo unnaaru
prabhuvullaaga bratikevaaLLanu baanisaluga chestunnaaru
udyOgaalaku veTalaaDamani ooLLapaiki tOlestunnaaru 
baDilO emundee devuni guDilOne undee

:::2

chadavakapOte manishi rivvuna chandruDi paiki egirevaaDaa
gira gira tirigi vachche vaaDaa
devuDu challaga chooDakapOte akkaDa gallantaipODaa
aanavaalu chikke vaaDaa

baDilO emundee devuni guDilOne undee
guDilO emundee baaboo baDilOne undee

:::3

chaduvulusaaram hari yani..hari kooDaa chadavaalani
chaduvula marmam hari yani..aa hari kee guruvumDaalani
hariye sarvaSamani..chaduve sarvaSamani
haribhaktuDu prahlaaduDu munupe balla guddi cheppaaDu

aa hariye SreekRshNuDugaa vachchi baDilO koorchoni chadivaaDu
ee baDilO koorchoni chadivaaDu chadivaaDu chadivaaDu chadivaaDu
chadivaaDu chadivaaDu

No comments: