సంగీతం::ఘంటసాల
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల,P. సుశీల
తారాగణం::N.T.రామారావు, దేవిక,రమణమూర్తి,కాంతారావు,గుమ్మడి,రేలంగి
పల్లవి::
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
కలకల విరిసీ జగాలే పులకించెలే
కలకల విరిసీ జగాలే పులకించెలే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే
కలకల విరిసీ జగాలే పులకించెలే
చరణం::1
ఓ ఓ ఓ ఓ ఓ..
అలరుల తోటా అందాల బాట
కూవూ కూవూ
హాయిగ పాడే కోయిల పాట కోయిల పాట
తెలియని కోరికలేవో కలిగించెనే
కలకల విరిసీ జగాలే పులకించెలే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే
కలకల విరిసీ జగాలే పులకించెలే
చరణం::2
ఆ హా హా ఆ హా హా ఆహా హా
ఓ ఓ ఓ ఓ ..
చల్లనిగాలీ మెల్లగ వీచే
హృదయము దూసి మనసే దోచే మనసే దోచే
మనసులు నిండి ప్రణయాలే చెలరేగెనే
కలకల విరిసీ జగాలే పులకించెలే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే
కలకల విరిసీ జగాలే పులకించెలే
చరణం::3
ఓ ఓ ఓ ఓ ఓ ..
చెలిచూపులలో అనురాగాలు
నిజమేనా అని అనుమానాలు అనుమానాలు
సందేహాలేలా హృదయాలే మన సాక్షులు
కలకల విరిసీ జగాలే పులకించెలే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే
కలకల విరిసీ జగాలే పులకించెలే
ఆ హా హా ఆ హా హా ఆహా హా
No comments:
Post a Comment