Monday, March 21, 2011

బావమరదళ్ళు--1960



సంగీతం::పెండ్యాల
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
తారాగణం::రమణమూర్తి,కృష్ణకుమారి, C. S. R. ఆంజనేయులు, పెరుమాళ్ళు,బాలకృష్ణ 

పల్లవి::

నీలిమేఘాలలో..గాలి కెరటాలలో
నీవు పాడే పాట..వినిపించునీ వేళా
నీలిమేఘాలలో..ఓ..

చరణం::1

ఏ పూర్వపుణ్యమో..నీ పొందుగా..ఆ..మారీ
ఏ పూర్వపుణ్యమో..నీ పొందుగా..ఆ..మారీ
అపురూపమై నిలిచే..నా అంతరంగానా

నీలిమేఘాలలో..గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో..ఓ..

చరణం::2

నీ చెలిమిలోనున్న..నెత్తావి మాధురులు
నీ చెలిమిలోనున్న..నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరపింప చేయు

నీలిమేఘాలలో..ఓ..

చరణం::3

అందుకో జాలనీ..ఆనందమే..ఏ..నీవు
అందుకో జాలనీ..ఆనందమే..ఏ..నీవు
ఎందుకో చేరువై..ఈ..దూరమౌతావు

నీలిమేఘాలలో..గాలి కెరటాలలో
నీవు పాడే పాట..వినిపించునీ వేళా 
నీలిమేఘాలలో..ఓ..

No comments: