Tuesday, May 07, 2013

ఆచార్య ఆత్రేయగారి జయంతి



















ఈ రోజు తెలుగు తేజోమూర్తి మనసుకవి ఆచార్య ఆత్రేయగారి  జయంతి...(07-05-2013) సందర్భంగా ఆ 

మహనీయుని గురించి తెలుసుకుందాము.. 

"మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే; మన్సున్న మనిషికి సుఖములేదంతే .... " అని జీవతానుభవంలోని 


భావాలను, తనలోని భారతీయ తత్వంతో రంగరించి పాటల రూపంలో 

సరళమైన సుమధుర భాషలో, మనసులను స్పందింపచేస్తూ రాసిన పాట. "నే వెళ్ళుదారి ఓ ముళ్ళ దారి, రాలేరు 

యవ్వరు నాతో చేరి" అంటూ తనదైన పంథా ఏంటో చెప్పకనే 


చెప్పారు ఆత్రేయ. ఆయన రచనలలో - భావుకత; ఆవేదన; భక్తి; సామాజిక మూల్యాలతోపాటు మానవతావాదిని 

కూడా చూడవచ్చు.1921, మే 7 న, నెల్లూరు జిల్లా 

సూళ్ళూరుపేట లోని మంగళంపాడు గ్రామంలో సీతమ్మ, కృష్ణమాచార్యుల దంపతులకు జన్మించారు కిళాంబి 

వేంకట నరసిమ్హాచార్యులు. వీరు ఆత్రేయ గోత్రికులు. మనదరికీ 

ఆచార్య ఆత్రేయ గా పరిచయం. 1940, ఫిబ్రవరి 10 న, ఆత్రేయ గారికి పద్మావతి గారితో వివాహం జరిగింది. 

అధ్యాపకుడిగా శిక్షణ పొందేరు. బ్రిటీష్ కి విరుద్ధంగా "క్విట్ ఇండియా" 

ఉద్యమంలో పాల్గొని కారాగారవాసం అనుభవించారు. తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, తిరుత్తణి మున్సిఫ్ 

కోర్టులో, సెటిల్మెంట్ ఆఫీసులో గుమాస్తాగా పనిచేసారు. తరువాత

జమీన్ రైతు ఉపసంపాదకుడిగా, గుడివాడలో నాటక కళా పరిషత్ కార్యదర్శిగా పనిచేసారు.చిన్నప్పటినుండి 

నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో 

మధ్య తరగతి కుటుంబ సమస్యలనుతీసుకుని మనోహరమైననాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' 

నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్అవార్డులను 

గెలుచుకున్నారు. విశేషంగారాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' 

బాగాప్రాఅచారం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులనువివరించే 

'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలోచెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు అనే 

మూడంకాల నాటకం మరియువిశ్వశాంతిని కాంక్షించేవిశ్వశాంతి' నాటకాన్ని 

రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లబించింది. 'సామ్రాట్అశోక','గౌతమ బుద్ధ' 

మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.\ఆత్రేయ పలు చలన 

చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబందించినప్రస్తావన ఉండటం 

వలన ఆయనమనసు కవి, మన సుకవి అయ్యాడు. దీక్ష (1950) 

చిత్రానికి తొలిసారి గీత రచన, అదేసంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారికధా రచన చేసారు. 

వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు.చిన్ని 

చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే 

అందరిమనసులను దోచుకున్న ఈమనసు కవి 1989,సెప్టెంబర్ 9 న 

స్వర్గస్తులయ్యారు.

తెలుగు సాహిత్యరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేటు 

ప్రధానం చేసారు
తన రచనలతో రసాలొలికించిన కవి ఆత్రేయ. వేదాంత దోరణి కలిగి ఉండి, జీవిత సారాన్ని రంగరించి, తన 

పాటలలో అతి నిగూడ సత్యాలను అలవోకగా రాసి అందించిన మహా కవి. 

తెలుగు భాషలోని తేట తనాన్ని, మాధుర్యాన్ని ఇలా అభివర్ణించారు తన పాటల్లోఇలా మనసున్న మనిషి పడే, 

తపన, అంతరంగంలో అనుభవించే ఆవేదన, పరిపరవిధాల 

పరిబ్రమించే సున్నిత, చంచల, కోమల, రంజిత మనస్స్థితులను తన అక్షరమాలలో పేర్చారు ఆత్రేయ. తెలుగు 

నాట ఇంత జనప్రియం పొందిన పాటలు లేవు అంటే అతిశయోక్తి 

కాదు. వారి తెలుగు భాషా ప్రతిభ, తత్వ చింతన అత్యున్నత స్థాయివి.చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని 

పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే 

అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు.
rachana::Ravindra Bhatraju 

No comments: