సంగీతం::మాస్టర్ వేణు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
పల్లవి::
అతడు:అంత కోపమైతే నేనెంత బధ పడతానో
తెలుసా తెలుసా
ఆమె:అలా వెంట పడితే నేనెలా మండి పడతానో
తెలుసా తెలుసా
అతడు:అంత కోపమైతే నేనెంత బధ పడతానో
తెలుసా తెలుసా
ఆమె:అలా వెంట పడితే నేనెలా మండి పడతానో
తెలుసా తెలుసా
చరణం::1
అతడు:గులాబి పువ్వంటే భలేగా మోజుంది
అహా..ఓహో..ఆహాహాహాహా...
ముళ్ళు గుచ్చుకుంటాయని..మొన్న మొన్న తెలిసింది
గులాబి పువ్వంటే భలేగా మోజుంది
ముళ్ళు గుచ్చుకుంటాయని..మొన్న మొన్న తెలిసింది
ఆమె:ఆ మోజులెందుకో ఆ పోజులెందుకో
ఆ మోజులెందుకో ఆ పోజులెందుకో
అందాల పూల జోలి అడవి మనిషికెందుకో
ఓ ఓ ఓ ....
అతడు:అంత కోపమైతే నేనెంత బధ పడతానో
తెలుసా తెలుసా
ఆమె:అలా వెంట పడితే నేనెలా మండి పడతానో
తెలుసా తెలుసా
చరణం::2
అతడు:కసిరే నీ మదిలో మిసిమి తలపులొస్తాయి
కలలోనైనా నా వలపులు చిగురిస్తాయి
కసిరే నీ మదిలో మిసిమి తలపులొస్తాయి
కలలోనైనా నా వలపులు చిగురిస్తాయి
ఆమె:తలపులు లేవులే కలలే రావులే
తలపులు లేవులే కలలే రావులే..ఏ..ఓ ఓ ఓ
కిలాడి మాటలల్లి వలపు గెలవ లేవులే
అతడు:అంత కోపమైతే నేనెంత బధ పడతానో
తెలుసా తెలుసా
ఆమె:అలా వెంట పడితే నేనెలా మండి పడతానో
తెలుసా తెలుసా
అతడు:అంత కోపమైతే నేనెంత బధ పడతానో
తెలుసా తెలుసా
ఆమె:అలా వెంట పడితే నేనెలా మండి పడతానో
తెలుసా తెలుసా
No comments:
Post a Comment