సంగీతం::C.రామచంద్ర
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::మహమ్మద్ రఫీ
పల్లవి::
తారలెంతగా మెరిసేను..తారలెంతగా మెరిసేను
చందురుని కోసంచందురుని కోసం
రేయి ఎంతగా మురిసేను..రేయి ఎంతగా మురిసేను
దినకరుని కోసం దినకరుని కోసం
తారలెంతగా మెరిసేను
చరణం::1
చిగురుటాకులే చేతులుగా..మిసిమిరేకులే పెదవులుగా
చిగురుటాకులే చేతులుగా..మిసిమిరేకులే పెదవులుగా
పరిమళాలే పిలుపులుగా..మకరందాలే వలపులుగా
పూవులెంతగా వేచేను..పూవులెంతగా వేచేను
తుమ్మెదల కోసం..తుమ్మెదల కోసం
తారలెంతగా మెరిసేను
చరణం::2
నింగి రంగులే కన్నుల దాచి కడలి పొంగులే ఎదలో దాచి
నింగి రంగులే కన్నుల దాచి కడలి పొంగులే ఎదలో దాచి
గులాబి కళలే బుగ్గల దాచి మెరుపుల అలలే మేనిలో దాచి
పరువాలెంతగ వేచేను..పరువాలెంతగ వేచేను
పయ్యెదల కోసం..పయ్యెదల కోసం
తారలెంతగా మెరిసేను..చందురుని కోసం
No comments:
Post a Comment