సంగీతం::సాలూరి వాసురావు
రచన::భువనచంద్ర
దర్శకత్వం::విజయబాపినీడు
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,జయప్రద.
పల్లవి::
జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ
దారిలో మమతలే పూవులై కురియనీ
ఇలానే...ఇలానే
జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ
చరణం::1
జలతారు మేఘం పరదాలు దాటీ
నీలాల నింగీ నే చేరుకోనా
ఆ తారలన్నీ తళుకాడు వేళా
ఎన్నెన్నొ కలలూ కదలాడవా
ఆ కాంతినై ఇలా ఇలా నేనుండిపోనా
జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ
చరణ::2
దరిచేరు వేళా చిరుసిగ్గులో
మనసైన వానీ కనుచూపులో
సరికొత్త అందం చిగురించితే
పోగలవ రేఖా కనుగీటితే
ఆ రేఖనై ఇలా ఇలా నే ఒదిగిపోనా
జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ
దారిలో మమతలే పూవులై కురియనీ
ఇలానే...ఇలానే
జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ
No comments:
Post a Comment