Monday, November 14, 2011

బొమ్మలు చెప్పిన కథ--1969
























సంగీతం::మాస్టర్ వేణు
రచన::కొసరాజు
గానం::P.సుశీల, బృందం

పల్లవి::

సిరులిచ్చు లేవమ్మా శ్రీలక్ష్మిదేవి
పసుపు కుంకుమలిచ్చునమ్మా పార్వతీదేవి

బృందం::సిరులిచ్చు లేవమ్మా శ్రీలక్ష్మిదేవి
పసుపు కుంకుమలిచ్చునమ్మా పార్వతీదేవి
సిరులిచ్చు లేవమ్మా శ్రీలక్ష్మిదేవి

చరణం::1

జాతిరత్నము గర్భమందున
జననమందాలి

బృందం:: జననమందాలి
ఆ..జననమందాలి..

సామ్రాజ్యముల పాలించి తండ్రికి ఖ్యాతి తేవాలి

బృందం::ప్రఖ్యాతి తేవాలి

ఆ..ధీరుడై రణశూరుడై సుకుమారుడై
ప్రజలెల్ల మెచ్చగ
అతనికతడే సాటియన జయముందుకోవాలి

బృందం::సిరులిచ్చు లేవమ్మా శ్రీలక్ష్మిదేవి
పసుపు కుంకుమలిచ్చునమ్మా పార్వతీదేవి
సిరులిచ్చు లేవమ్మా శ్రీలక్ష్మిదేవి

ఆ ఆ ఆ ఆ ఆ..

చరణం::2

ముంచేతి గాజులు ఎపుడు గలగల
మ్రోగుచుండాలి

బృందం::గలగల మ్రోగుచుండాలి

తల్లోని పూవులు ఘుమఘుమలు
వెదజల్లుచుండాలి
బృందం::వెదజల్లుచుండాలి

పుట్టినింటికి మెట్టినింటికి
వన్నె తెచ్చిన సాధ్వివై
కలకాలమును ముత్తైవుగా
నీ బ్రతుకు గడపాలీ

బృందం::బృందం::సిరులిచ్చు లేవమ్మా శ్రీలక్ష్మిదేవి
పసుపు కుంకుమలిచ్చునమ్మా పార్వతీదేవి
సిరులిచ్చు లేవమ్మా శ్రీలక్ష్మిదేవి..

No comments: