Tuesday, April 02, 2013

జయభేరి--1959






























సంగీతం::పెండ్యాల 
రచన::ఆరుద్ర 
గానం::ఘంటసాల 
తారాగణం::అక్కినేని, అంజలీదేవి, S.V. రంగారావు, నాగయ్య,గుమ్మడి, శాంతకుమారి

పల్లవి:: 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
సంగీత సాహిత్యమే మేమే
నవశృంగార లాలిత్యమే మేమే 
సంగీత సాహిత్యమే మేమే
నవశృంగార లాలిత్యమే మేమే 

రాగానికి లాస్యం చేసి
భావానికి జీవం పోసి 
రాగానికి లాస్యం చేసి
భావానికి జీవం పోసి 
నాట్యాన లోకాలేలేము
మాసరి మేమేగా 

సంగీత సాహిత్యమే మేమే
నవశృంగార లాలిత్యమే మేమే 

చరణం::1 

కాకతి సామ్రాజ్య లక్ష్మి రుద్రమ్మదేవి 
అరిభయంకర కడ్గధారణే నేను 

అలనాటి పలనాటి వరబాలచంద్రుల 
శౌర్యప్రతాపాల సారమే నేను 
ననుమించి నన్నొంచగల ధీరులెవరు 
పరమ మాహేశ్వరుడు పాల్గురితోమన్న 
పలుకులల్లిన వీరగాథలే నేను 

మురిపించు శృంగారి మువ్వపురి క్షేత్ర్యయ్య 
పదకవితలో మధురభావమే నేను 
కవి కోకిలల మంజుగానమే నేను 
కవి సింహముల చండగర్జనే నేను 

చరణం::2 

నవ్యభావాల్ జీవనదులుగా ఉప్పొంగ మణులు 
పండే తెలుగు మాగాణమే మేము 
జాణు తెనుగే మేము జాతి ఘనతే మేము 
జాణు తెనుగే మేము జాతి ఘనతే మేము 
ఇక దిగ్విజయ యాత్ర సాగించమా..ఆ
జగమెల్ల మార్మోగ జయభేరి మ్రోగించమా..ఆ 
జయభేరి జయభేరి జయభేరి మ్రోగించమా..ఆ

No comments: