సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు, P.సుశీల
పల్లవి::
నీ నీలి నయనాల రవళించు రాగాల జడిలోన నే పాడనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ నీలి నయనాల రవళించు రాగాల జడిలోన నే పాడనా
నీ మధుర హృదయాన నినదించు నాదాల జతిలోన నేనాడనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ నీలి నయనాల రవళించు రాగాల జడిలోన నే పాడనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ మధుర హృదయాన
నినదించు నాదాల జతిలోన నేనాడనా
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సానిని
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సాసస
చరణం::1
శిలల కరిగించు కలలు చిగురించు నీ రూపు నే తీర్చనా
తలపులూహించు వలపులూరించు అందాలు నే చూడనా
మనసు వికసించు మమత వరియించు నీ చెలిమి నే కోరనా
మనల మరిపించు ఒకటే అనిపించు అద్వైతమే నేను కానా
ఆనంద సౌధాన అందాల జాబిల్లిగా నిన్ను వెలిగించనా
అనురాగ శిల్పాన అతిలోక కల్పనగా నిను నేను ఊహించనా
నీ నీలి నయనాల రవళించు రాగాల జడిలోన నే పాడనా
నీ మధుర హృదయాన నినదించు నాదాల జతిలోన నేనాడనా
చరణం::2
వెలుగులను నించు సిరుల కురిపించు నీ నవ్వులై నవ్వనా
వయసు మురిపించు బ్రతుకే ఫలియించు నీ ప్రేమలో పండనా
అడుగు జత చేర్చి నడక కలబోసి నీ నీడనై నడవనా
ఎడద పరిచేసి గుడిగా మలిచేసి నీరాజనాలివ్వనా
నా జన్మజన్మాల నా పూర్వ పుణ్యాల నా దేవిగా నిన్ను భావించనా
ఈ నొసటి కుంకుమ ఈ పసుపు సంపద నీ వరముగా పొంది వర్ధిల్లనా
నీ నీలి నయనాల రవళించు రాగాల జడిలోన నే పాడనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ మధుర హృదయాన నినదించు నాదాల జతిలోన నేనాడనా
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సానిని
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సాసస
No comments:
Post a Comment