Monday, March 11, 2013

భాగ్యరేఖ--1957::ఆభేరి::రాగం




సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::దేవులపల్లి కృష్ణశాస్ర్తి
గానం::P.సుశీల
పొన్నలూరి బ్రదర్స్ వారి
Film Direkted By::B.N. Reddi
తారాగణం::N.T.రామారావు, జమున,జానకి, సూర్యకాంతం,రేలంగి, 
రమణారెడ్డి,అల్లు రామలింగయ్య

ఆభేరి::రాగం 


పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో..ఏ పూల పూజింతునో

చరణం::1

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె
నీ పాద సేవా మహాభాగ్యమీవా
నాపై నీ దయజూపవా..నా స్వామి
నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో..ఓ ఓ ఓ  
ఏ పూల పూజింతునో..

చరణం::2

దూరాననైన కనే భాగ్యమీవా
నీ రూపు నాలో సదా నిల్వనీవా
ఏడుకొండలపైనా వీడైన స్వామి
నా పైని దయజూపవా..నా స్వామి
నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో..ఓ ఓ ఓ 
ఏ పూల పూజింతునో..మ్మ్ మ్మ్ 

2 comments:

కమనీయం said...




ఈ చక్కని పాట చాలా ప్రసిద్ధి చెందింది.ధన్యవాదాలు. కాని దర్శకత్వం B.S.రెడ్డి అని వేసారు.బహుశా టైపు తప్పు కావచ్చును.B.N.రెడ్డి అని సవరించండి.

srinath kanna said...

namastE kamaneeyam garu__/\__
chaalaa thanks andii tappakunda savaristaanandii naa blog nu darsinchinanduku kRtagnatalu