సంగీతం::పెండ్యాల
రచన::ఆరుద్ర
గానం::పిఠాపురం
తారాగణం::జగ్గయ్య, రమణమూర్తి, రమణారెడ్డి, దేవిక, హేమలత,గిరిజ, సీత
పల్లవి::
బుద్దొచ్చెనా నీకు మనసా
మంచి బుద్దొచ్చెనా నీకు మనసా
అద్ధరిని వైకుంఠమ్మిద్ధరిని నరకం
మధ్య గల ఏట్లో శుద్ధి కాగా బాగ
బుద్దొచ్చెనా నీకు మనసా
మంచి బుద్దొచ్చెనా నీకు మనసా
చరణం::1
చిత్తమొచ్చిన రీతి అత్త గారిని తిట్టి
నెత్తి మీదకు కళ్ళు తెచ్చుకుంటివి గనీ
చేతులారా నీవు చేసుకున్న ఖర్మా
చేతులారా నీవు చేసుకున్న ఖర్మా
భూతమై నిన్నిటుల గోతిలో తోయంగ
బుద్దొచ్చెనా నీకు మనసా
మంచి బుద్దొచ్చెనా నీకు మనసా
చరణం::
కొడుకునీ కోడల్నీ కొట్టి తగిలేసావు
కూతుర్ని అల్లున్ని కోరి రప్పించావూ
తవ్వి తలకెత్తునని తలపోయ అల్లుడే
తాగుబోతై నిన్ను తరిమి తరిమి కొట్ట
బుద్దొచ్చెనా నీకు మనసా
మంచి బుద్దొచ్చెనా నీకు మనసా
చరణం::3
ఆడువారెప్ప్డు అణకువగ యుండాలే
అందరికి సమముగా ఆదరణ చూపాలే
అత్తయు ఒక ఇంటి కోడలని మరవకుడు
అత్తయు ఒక ఇంటి కోడలని మరవకుడు
అయిన వాడిని గనుక అసలు సంగతిని చెబితి
బుద్దొచ్చెనా నీకు మనసా
మంచి బుద్దొచ్చెనా నీకు మనసా
అద్ధరిని వైకుంఠమ్మిద్ధరిని నరకం
మధ్య గల ఏట్లో శుద్ధి కాగా బాగ
బుద్దొచ్చెనా నీకు మనసా
మంచి బుద్దొచ్చెనా నీకు మనసా
No comments:
Post a Comment