Thursday, February 21, 2013

సొమ్మొకడిది సోకొకడిది--1978



సంగీతం::రాజన్ నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి 
నటీ,నటులు::కమల్‌హాసన్,జయసుధ,రోజారమణి

పల్లవి::

తొలివలపు తొందరలు...
తొలివలపు తొందరలు..ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను చలితో నీవు..చేసే అల్లరులు

ఆ ఆ ఆ....
తొలివలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు చలితో నేను చేసే అల్లరులు
తొలివలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు

చరణం::1

పిలిచే నీ కళ్ళు తెలిపే ఆ కళ్ళు కరగాలి కౌగిళ్ళలో
వలపించే ఒళ్ళు వలచే పరవళ్ళు కదిలె పొదరిళ్ళలో

తెరతీసే కళ్ళు తెరిచే వాకిళ్ళు కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు మూసే గుప్పిళ్ళు బిగిసే సంకెళ్ళలో

నీలో అందాలు నేనే పొందాలి నాకే చెందాలిలే

తొలివలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
ఆ..చెలితో నేను చలితో నీవు చేసే అల్లరులు

తొలివలపు తొందరలు..ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు తొందరలు..ఉసిగొలిపే తెమ్మెరలు

చరణం::2

ఆహా..ఆ ఆ ఆ హేహే..ఆ ఆ ఓ ఓ ..

కురిసే ఈ వాన తడిసే నాలోన..రేపిందిలే తోందరా
పలికే పరువాన వలపే విరివాన..నీవే ఔనా కదా
వణికే నీ మేన సనికే నా వీణ..పలికిందిలే మోహనా
విరిసే నా నవ్వు విరజాజి పువ్వు..సిగలొ నేనుంచనా
నీలో రాగాలు నాలో రేగాలి నేనే ఊగాలిలే

తొలివలపు తొందరలు..ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు చలితో నేను..చేసే అల్లరులు

తొలివలపు తొందరలు..ఆహా..ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు తొందరలు..హ్హా హ్హా..ఉసిగొలిపే తెమ్మెరలు

No comments: