రచన::వేటూరి సుందర రామ మూర్తి
గానం::S.P.బాలు
మాండ్ , దేశ్ రాగం
పల్లవి::
నీలాలు కారేనా..కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా..నీ లాలి నే పాడలేనా?
జాజి పూసే వేళ..జాబిల్లి వేళ
పూలడోల నేను కానా...
నీలాలు కారేనా..కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా..నీ లాలి నే పాడలేనా
జాజి పూసే..వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా...
చరణం::1
సూరీడు..నెలరేడు
సిరిగల దొరలే కారులే
పూరిగుడిసెల్లో..పేదమనస్సులో
వెలిగేటి దీపాలులే
ఆ నింగి..ఈ నేల
కొనగల సిరులే లేవులే
కలిమి లేముల్లో కరిగే ప్రేమల్లో
నిరుపేద లోగిళ్ళులే
నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా..నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా...
చరణం::2
ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లో
కలల కన్నుల్లో కలతారిపోవాలిలే
ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నీవుంటే..ఒదిగి పోతుంటే
కడతేరి పోవాలిలే
నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా..నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా
నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా..నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా
No comments:
Post a Comment