Wednesday, August 15, 2012

mitrulu andarikii independence day 2012. Subhaakaankshalu

























తేనెలతేటల మాటలతో
మనదేశ మాతనే కొలిచెదమా
భావం, భాష్యం చూసుకొని
సుఖజీవనయానం చేయుదమా

తేనెలతేటల మాటలతో
మనదేశ మాతనే కొలిచెదమా
భావం, భాష్యం చూసుకొని
సుఖజీవనయానం చేయుదమా

1::సాగరమేఖల చుట్టుకొని
సురగంగ చీరలా మలచుకొని
స్వేచ్చగానం పాడుకొని
మనదేవికి ఇవ్వాలి హారతులు

తేనెలతేటల మాటలతో
మనదేశ మాతనే కొలిచెదమా
భావం, భాష్యం చూసుకొని
సుఖజీవనయానం చేయుదమా

2::గంగజఠాధర భావనలో
హిమశైల రూపమే నిలుపుకొని
గలగలపారే నదులన్ని
ఒక బృందగానమే చేస్తూవుంటే

తేనెలతేటల మాటలతో
మనదేశ మాతనే కొలిచెదమా
భావం, భాష్యం చూసుకొని
సుఖజీవనయానం చేయుదమా

3::ఎందరో వీరుల త్యాగఫలం
మననేటి స్వేచ్చకు మూలబలం
వారందరిని తలచుకొని
మనమానసవీధిని నిలుపుకొని

తేనెలతేటల మాటలతో
మనదేశ మాతనే కొలిచెదమా
భావం, భాష్యం చూసుకొని
సుఖజీవనయానం చేయుదమా

**************************************************************************************




2::ఇదే ఇదే నా దేశం - ఇదే ఆంధ్రదేశం

తరతరాల చరిత్రలో తడిసిన సందేశం
శాతవాహనుల నాటి శౌర్యము ఊపిరిగా
కాకతీయ రాజుల సంగ్రామ దీక్ష సిరిగా
త్యాగరాజు గానసుధ ధారలు సంపదగా
పోతరాజు భాగవతపు గాధలు నా ఎదగా
హంసి అమరావతి నాకమరినని శ్రీకళలై
గోదానది కృష్ణవేణి కూరిమి నిచ్చెలులై
కూచిపూడి నాట్యము నా గొప్పను పెన్నిధిగా
విలసిల్లిన వికసించిన సంస్కృతి సన్నిధిగా
అంధత్వం అన్ని దిశల ఆలోచన రేపగా
తెలుగుల అభిమాన ధనం దిక్కుల వ్యాపించగా
ఇది కోస్తా తెలంగాణా ఇది రాయలసీమగా
ఏడు కోట్ల గొంతులచే రాగము వినిపించగా

**************************************************************************************













మన జన్మభూమి

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము


ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో
జనయించినవాడ నీ స్వర్గఖండమున
ఏ మంచి పూవులన్ ప్రేమించినావో
నినుమొసె ఈ తల్లి కనక గర్భమున


లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేదురా మనవంటి పౌరులింకెందు
సూర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల ఝండాలు ఆడునందాక


అందాక గల ఈ అనంత భూతల్లిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ తెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ గీతములు

No comments: