సంగీతం::రాజేశ్వరరావ్
రచన::దాశరధి
గానం::ఘంటసాల,P.సుశీల
ఆభేరి::రాగం
గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చింతింతువే టొమేటో
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .
ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోశము
ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోశము
ఒకటే హృదయం కోసమూ
ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దర అతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా..ఆ..
ఆ...ఓ..
జతగా చెలిమీ చేసిరీ..అతిగా కరుణే చూపిరీ..ఆ..
చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే
ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోశము
ఒకటే హృదయం కోసము
ఓ..
రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము..ఆ..
ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము
ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోశము
ఒకటే హృదయం కోసము
No comments:
Post a Comment