సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,బృందం
పల్లవి::
అట్లతద్దోయ్ ఆరట్లోయ్..ముద్దపప్పోయ్ మూడట్లోయ్
ఆటలనోము అట్టతద్ది..
ఆటలనోము అట్లతద్ది..ఆడపిల్లలు నోచేతద్ది
వేడుకమీరక..కోరికతీరగ..
ఓ..చెలియా నోచవే..జీవితమే..పూచెనే
ఆటలనోము అట్లతద్ది..ఆడపిల్లలు నోచేతద్ది
వేడుకమీరక..కోరికతీరగ..
ఓ..చెలియా నోచవే..జీవితమే..పూచెనే
చరణం::1
చందమామ కన్న చాలా అందమైన మొగుడు
సన్నజాజి పొదలకన్న చక్కనైన ఇల్లు..
చందమామ కన్న చాలా అందమైన మొగుడు
సన్నజాజి పొదలకన్న చక్కనైన ఇల్లు..
బంగారు బొమ్మకు కావాలే బావయ్య నేడే రావాలే
ఈ బంగారు బొమ్మకు కావాలే బావయ్య నేడే రావాలే
పన్నీరు జల్లేటి పబ్బాల కోసం..
నోచినచో ఓ చెలి..నీ మొగుడే జాబిలి..నీ మొగుడే జాబిలి
ఆటలనోము అట్లతద్ది..ఆడపిల్లలు నోచేతద్ది
వేడుకమీరక..కోరికతీరగ..
ఓ..చెలియా నోచవే..జీవితమే..పూచెనే
చరణం::2
గోరెంటాకు పెట్టుకొంటే..చేయి పండేనమ్మా
" చేయి పండితే చేపట్టే వాడొస్తాడే "
తమలపాకు వేసుకొంటే నోరు పండే నమ్మా
" నోరు పండితే పండంటి మొగుడొస్తాడే "
గోరెంటాకు పెట్టుకొంటే..చేయి పండేనమ్మా
తమలపాకు వేసుకొంటే నోరు పండే నమ్మా
నీ కన్నె వలపే పండాలి..ఆపైన నీ ఒడి ని9ండాలి
నీ కన్నె వలపే పండాలి..ఆపైన నీ ఒడి ని9ండాలి
నీ ఆశ ఆకాశమే తాకి..రాగ
ఊయాలపై ఊగవే కోయిలవై కూయవే
ఊయాలపై ఊగవే కోయిలవై కూయవే
ఆటలనోము అట్లతద్ది..ఆడపిల్లలు నోచేతద్ది
వేడుకమీరక..కోరికతీరగ..
ఓ..చెలియా నోచవే..జీవితమే..పూచెనే
No comments:
Post a Comment