సంగీతం::మాస్టర్ వేణు
రచన::సముద్రాల జూనియర్
గానం::ఘంటసాల
నటీ,నటులు::జగ్గయ్య,కృష్ణకుమారి,అంజలీదేవి,గుమ్మడి,చలం,గిరిజ,పేకేటి
పయనించే ఓ చిలుకా
పయనించే ఓ..చిలుకా..ఆ..
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు
పయనించే ఓ చిలుకా..ఆ ఆ ఆ
చరణం::1
తీరెను రోజులు నీకీ కొమ్మకు
కొమ్మా ఏ చోటు వదలి
తీరెను రోజులు నీకీ కొమ్మకు
కొమ్మా ఏ చోటు వదలి
ఎవరికీ వారే ఏదోనాటికి
ఎరుగము ఎటుకో ఈ బదిలీ
మూడు దినాల ముచ్చటయే..ఏ..ఏ..ఏ..
మూడు దినాల ముచ్చటయే
ఈ లోకంలో మన మజిలీ
నిజాయితీగా ధర్మపధాన
నిజాయితీగా ధర్మపధాన
చనుమా ధైర్యమె తోడు
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు
పయనించే ఓ చిలుకా..ఆ ఆ ఆ
చరణం::2
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు
పయనించే ఓ చిలుకా..ఆ ఆ ఆ
పుల్లా పుడక ముక్కున కరచి
గూడును కట్టితివోయి
వానకు తడిసిన నీ బిగిరెక్కలు
ఎండకు ఆరినవోయి
ఫలించలేదని చేసిన కష్టము..మూ..
ఫలించలేదని చేసిన కష్టము
మదిలో వేదన వలదోయి
రాదోయి సిరి నీ వెనువెంట
రాదోయి సిరి నీ వెనువెంట
త్యాగమే నీ చేదోడు..
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు
పయనించే ఓ చిలుకా..ఆ ఆ ఆ
చరణం::3
పయనించే ఓ చిలుకా..ఆ ఆ ఆ
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు
పయనించే ఓ చిలుకా..ఆ ఆ ఆ
మరవాలి నీ కులుకుల నడలే..ఏ..
మదిలో నయగారాలే..
మరవాలి నీ కులుకుల నడలే...
మదిలో నయగారాలే
తీరని వేదన తీయని ముసుగే
శిరసున సింగారాలే
ఓర్వలేని ఈ జగతికి నీపై..ఈ ఈ..
ఓర్వలేని ఈ జగతికి నీపై..
లేవే కనికారాలే......
కరిగీ కరిగీ కన్నీరై..
కరిగీ కరిగీ కన్నీరై..
కడతేరుటె నీ తలవ్రాలే
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు
పయనించే ఓ చిలుకా..ఆ ఆ ఆ
చరణం::4
గోడుమని విలపించేరే..ఏ..
నీ గుణము తెలిసినవారు
గోడుమని విలపించేరే..
నీ గుణము తెలిసినవారు
జోడుగ నీతో ఆడిపాడి కూరములాడినవారు
ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే
ఎన్నడో తిరిగి ఇటు నీ రాక
ఎవడే తెలిసినవాడు
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు
పయనించే ఓ చిలుకా..ఆ ఆ ఆ
No comments:
Post a Comment