Saturday, September 01, 2012

జయసింహ--1955

సంగీతం::T.V. రాజు
రచన::Sr.సముద్రాల
గానం::ఘంటసాల,A.P.కోమల

పల్లవి::

ఓ...ఓ..ఓ..ఓ..ఓ..ఓహో...
హోయ్! తందాన హోయ్! తందాన తాని తందనోయ్ తందాన

వీరుల కన్న తల్లి, వీర నారుల కాచిన దీతల్లి

తెలుసుకోరా తెలుగు బిడ్డా
తెలుసుకోరా తెలుగు బిడ్డా!
తెలుగుదేశం పోతుగడ్డరా!

హోయ్! తందాన హోయ్! తందాన తాని తందనోయ్ తందాన

చరణం::1

ధీశాలి పల్నాటి బ్రహ్మన్న, ధీరుడు ఖడ్గతిక్కన్న
రణధీరుడు ఖడ్గతిక్కన్న

రాజనీతికి వీరజాతికి
రాజనీతికి వీరజాతికి
మెరుగులు దిద్దిన మేటి వీరులోయ్!
మరువరాని మా తెలుగు వారలోయ్!

హోయ్! తందాన హోయ్! తందాన తాని తందనోయ్ తందాన

చరణం::2

మహామంత్రిణి నాగమ్మ, రాణి కాకతీయ రుద్రమ్మ
మారాణి కాకతీయ రుద్రమ్మ

ఎత్తువేసినా, కత్తి దూసినా
ఎత్తువేసినా, కత్తి దూసినా
తిరుగులేని మా వీరనారులోయ్
తెలుగువారల ఆడపడుచులోయ్!

హోయ్! తందాన హోయ్! తందాన తాని తందనోయ్ తందాన
హోయ్! తందాన హోయ్! తందాన తాని తందనోయ్ తందాన
హోయ్! తందాన హోయ్! తందాన తాని తందనోయ్ తందాన

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

No comments: