Saturday, September 01, 2012

పాతాళబైరవి--1951::రాగశ్రీ::రాగం




సంగీతం::ఘటసాల
రచన::పింగళి
గానం::ఘంటసాల,P.లీల

రాగశ్రీ::రాగం
పల్లవి::

ఎంతఘాటు ప్రేమయో ఎంతతీవ్రమీ క్షణమో ఎంతఘాటు ప్రేమయో
కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే నా మనసు మురిసెనే
ఎంతఘాటు ప్రేమయో

ఎంతలేత వలపులో ఎంతచాటు మోహములో ఎంతలేత వలపులో
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే నా మనసు నిలిచెనే
ఎంతలేత వలపులో

చరణం::1

ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
విరహములో వివరాలను విప్పిచెప్పెనే
ఎంతఘాటు ప్రేమయో..

ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయరే
ఎంతలేత వలపులో

2 comments:

శ్రీ said...

మంచి సాహిత్యం సుందరప్రియ గారూ!
అభినందనలు..
@శ్రీ

srinath kanna said...

Thanks you so much Srii garu :)