Saturday, September 01, 2012

పాతాళబైరవి--1951::ఆభేరి::రాగం






















సంగీతం::ఘటసాల
రచన::పింగళి
గానం::ఘంటసాల,P.లీల

ఆభేరి:::రాగం

ప్రణయ జీవులకు దేవి వరాలే
కానుకలివియే..ఏ..ప్రియురాలా!

హాయిగా మనకింకా స్వేఛ్ఛగా
హాయిగా మనకింకా స్వేఛ్ఛగా
హాయిగా...


చెలిమి ఇంచు పాటల..విలాసమైన ఆటల
చెలిమి ఇంచు పాటల..విలాసమైన ఆటల
కలసి మెలసి పోదమోయ్ వలపు బాటల
హాయిగా మనకింకా స్వేఛ్ఛగా..హాయిగా

నీ వలపు నా వలపు పూలమాలగా..ఆ..
నీ వలపు నా వలపు పూలమాలగా..ఆ..
నీవు నేను విడివడని ప్రేమమాలగా
హాయిగా మనకింక స్వేఛ్ఛగా..హాయిగా

కలలు నిజము కాగా కలకాలమొకటిగా
కలలు నిజము కాగా కలకాలమొకటిగా
తెలియరాని సుఖములలో తేలిపోవగా
హాయిగా మనకింక స్వేఛ్ఛగా..హాయిగా

హాయిగా మనకింక స్వేఛ్ఛగా..హాయిగా
హాయిగా మనకింక స్వేఛ్ఛగా..హాయిగా
స్వేఛ్ఛగా
హాయిగా
హాయిగా

2 comments:

శ్రీ said...

మరో మంచి సాహిత్యం...
చక్కని పాట...
సుందరప్రియ గారూ!
అభినందనలు..
@శ్రీ

srinath kanna said...

Subhodayam Srii garu

Thanks andii..regular ga naa blognu veekshistunnanduku...chaalaa krutajnatalu :)