Friday, August 17, 2012

చెంచులక్ష్మి--1958

సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
నిర్మాత & దర్శకత్వం::B.A.సుబ్బారావు
గాత్రం::ఘంటసాల,సుశీల
తారాగణం::నాగేశ్వరరావు,అంజలీదేవి

శంకరాభరణం::రాగం  
(హరికాంభోజి)

చెట్టు లెక్కగలవా ఒ నరహరి పుట్ట లెక్కగలవా
చెట్టు లెక్కగలవా ఒ నరహరి పుట్ట లెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా
ఒ నరహరి చిగురు కొయగలవా
చెట్టు లెక్కగలనే ఒ చెంచిత పుట్ట లెక్కగలనే
చెట్టు లెక్కగలనే ఒ చెంచిత పుట్ట లెక్కగలనే
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే
ఒ చెంచిత చిగురు కోయగలనే

ఉరకలేయగలవా ఒ నరహరి పరుగులెత్తగలవా
ఉరకలేయగలవా ఒ నరహరి పరుగులెత్తగలవా
ఊడ బట్టుకొని జారుడు బండకు వూగి చేరగలవా
ఒ నరహరి ఊగి చేరగలవా
ఉరకలేయగలనే ఒ చెంచిత పరుగులెత్తగలనే
ఉరకలేయగలనే ఒ చెంచిత పరుగులెత్తగలనే
ఊడ బట్టుకొని జారుడు బండకు వూగి చేరగలనే
ఒ చెంచిత ఊగి చేరగలనే

ఒహోహొ హొయ్ గురిని చూసుకొని కనులు మూసుకొని బాణమేయగలవా
ఒ నరహరి బాణమేయగలవా
గురిని చూసుకొని వెనుతిరిగి నానెముగ బాణమేయగలనే
ఒ చెంచిత బాణమేయగలనే
ఒ చెంచిత నిన్ను మించగలనే

చెట్టు లెక్కగలనే ఒ చెంచిత పుట్ట లెక్కగలనే
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే
ఒ చెంచిత చిగురు కోయగలనే

ఒహోహొ హొయ్ తగవులేల ఎగతాళికాదు నను తాళి కట్టనీవా
ఒ చెంచిత తాళి కట్టనీవా
మనసు తెలుసుకొని మరులు చూపితే మనువు నాడనిస్తా
ఒ నరహరి మనువు నాడనిస్తా
ఒ నరహరి మాల తెచ్చి వేస్తా

చెట్టు లెక్కగలవా ఒ నరహరి పుట్ట లెక్కగలవా
చెట్టు లెక్కగలవా ఒ నరహరి పుట్ట లెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా
ఒ నరహరి చిగురు కొయగలవా

No comments: